యంగ్ టైగర్- ప్రశాంత్ నీల్ బడ్జెట్ 500 కోట్లా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. షూట్ లో ఇంకా తారక్ జాయిన్ కాలేదు. ప్రస్తుతం తారక్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మార్చి లో తారక్ కూడా షూట్ లో జాయిన్ అవుతాడు. ఇది పక్కా ప్రశాంత్ వర్మ మార్క్ లో తెరకెక్కుతోన్న హై ఆక్టేన్ యాక్షన్ కంటెంట్ ఉన్న చిత్రం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని పాన్ ఇండియా కి కనెక్ట్ చేస్తూ రాసుకున్న కథ ఇది.
అందుకు తగ్గట్టే ప్రశాంత్ వర్మ పదునైన టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నాడు. కొంత మంది ఫస్ట్ క్లాస్ విదేశీ టెక్నిషియన్లు కూడా సినిమాకి పనిచేస్తున్నట్లు సమాచారం. అలాగే కోట్ల రూపాయాలతో భారీ సెట్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. సెట్లు కోసం...బ్యాకెండ్ టెక్నికల్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారుట. మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా బడ్జెట్ పై ఇంతవరకూ ఎక్కడా చర్చకు రాలేదు.
తాజాగా ఆ విషయం కూడా లీకైంది. ఈ సినిమాకు ఏకంగా 500 కోట్ల బడ్జెట్ కేటాయించారుట. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కువ శాతం పెట్టుబడి పెడుతుందిట. మిగతా బడ్జెట్ ఎన్టీఆర్ ఆర్స్ట్ పెడుతు న్నట్లు సమాచారం. కానీ ఎవరెంత పెడుతున్నారు? అన్నది క్లారిటీ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎంత మాత్రం ఆలోచించదు. సినిమా కోసం ఎన్నికోట్లైనా ఖర్చు చేసే నిర్మాణ సంస్థ అది.
ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా సినిమాలు నిర్మించింది. `పుష్ప 2` తో ఆసంస్థ భారీగా లాభాలు చూసింది. ఈ నేపథ్యంలో తారక్ సినిమా విషయంలో ఎంత మాత్రం రాజీ పడదు. ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా నటించిన `జనతా గ్యారేజ్` ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. `శ్రీమంతుడు` తర్వాత మైత్రీ నిర్మించిన రెండవ సినిమా గ్యారేజ్. `జనతా గ్యారేజ్` భారీ విజయం సాధించింది. 50 కోట్ల బడ్జెట్లో నిర్మించిన చిత్రం 130 కోట్ల వసూళ్లను సాధించింది. అలా ఎన్టీఆర్ ఆ సంస్థకు ఓ భరసో అందించారు.