తారక్-ప్రశాంత్ నీల్ వదిలేస్తారా? సాధిస్తారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సన్నాహాకాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే `డ్రాగన్` అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. `డ్రాగన్` అనే టైటిల్ తోనే మంచి బజ్ క్రియేట్ అవుతుంది. పవర్ పుల్ టైటిల్ గా జనాల్లోకి వెళ్తుంది. మరి ఈ టైటిల్ ఫిక్స్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేంగానీ టైటిల్ విషయంలో మాత్రం అప్పుడే అడ్డంకి ఏర్పడింది.
ఇదే టైటిల్ తో ప్రదీప్ రంగనాధ్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. `డ్రాగన్` టైటిల్ కి ప్రదీప్ సినిమాకి ఎలాంటి సంబంధం ఉందో తెలియదు గానీ ఇదే టైటిల్ తో సినిమా రిలీజ్ అయితే? ప్రశాంత్ నీల్ టైటిల్ విషయంలో వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. లేదా? అదే టైటిల్ తో రిలీజ్ చేసినా ముందు.. వెనుకా మరో పేరు జోడిస్తే వివాదం ఉండదు. అయితే అంతకంటే ముందే! ప్రశాంత్ నీల్ ముందు ఇక్కడో ఆప్షన్ ఉంది.
తారక్-ప్రశాంత్ నీల్ డ్రాగన్ టైటిల్ కే కట్టుబడి ఉంటే గనుక టైటిల్ ని ప్రధీప్ రంగనాధ్ టీమ్ విరమించుకునేలా చేయడం. ఇదేమి ఇండస్ట్రీలో కొత్తేం కాదు. చిన్న సినిమా టైటిల్స్-స్టార్ హీరోల టైటిల్స్ విషయంలో ఇలాంటి క్లాష్ ఏర్పడినప్పుడు చిన్న చిత్రాలే వెనక్కి తగ్గుతుంటాయి. అగ్ర హీరోల కోసం దర్శకులు సదరు టీమ్ ని రిక్వెస్ట్ చేస్తేటైటిల్ దానం చేయడం పెద్ద విషయం కాదు.
చాలా సందర్భాల్లో నేరుగా హీరోలే టైటిల్స్ విషయంలో చిన్న సినిమా నిర్మాతలతో మాట్లాడి సర్దుబాటు చేసుకున్నారు. ఇలాంటి విషయాల్లో పరిమిత బడ్జెట్ సినిమాల దర్శక, నిర్మాతల నుంచి కూడా పెద్దగా అభ్యంత రాలు వ్యక్తం చేయరు. పైగా ఎన్టీఆర్ ది పాన్ ఇండియా సినిమా. వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. టైటిల్ కూడా జనాల్లో బాగా రిజిస్టర్ అయింది. కాబట్టి తారక్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ `డ్రాగన్` టైటిట్ కే కట్టుబడి ఉంటే సాధించడం పెద్ద విషయం కాదు.