మొత్తానికి ఎన్టీఆర్- నీల్‌కు టైమొచ్చేసింది

మొత్తానికి నాలుగేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఎన్టీఆర్- నీల్ సినిమా ప‌ట్టాలెక్క‌బోతుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ రేప‌టి నుంచి ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

Update: 2025-02-19 09:47 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రానున్న‌ట్టు అనౌన్స్‌మెంట్ వ‌చ్చి ఇప్ప‌టికే నాలుగేళ్ల‌వుతుంది. అయినా ఇప్ప‌టివ‌ర‌కు సినిమా ప‌ట్టాలెక్కింది లేదు. వాస్త‌వానికి ఈ సినిమా కెజిఎఫ్2 త‌ర్వాతే రావాల్సింది. కానీ మ‌ధ్య‌లో ఎన్టీఆర్ డేట్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో స‌లార్ వ‌చ్చింది.

మొత్తానికి నాలుగేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఎన్టీఆర్- నీల్ సినిమా ప‌ట్టాలెక్క‌బోతుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ రేప‌టి నుంచి ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. మాస్ యాక్ష‌న్ చిత్రంగా రూపొంద‌నున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నుంది. అయితే ఈ మొద‌టి షెడ్యూల్ లో హీరో ఎన్టీఆర్ పాల్గొన‌డం లేదు.

ఎన్టీఆర్ మార్చి నుంచే షూటింగ్ లో జాయిన్ కానున్నాడ‌ని, ఈ లోపు మొద‌టి షెడ్యూల్ పూర్తైపోతుంద‌ని స‌మాచారం. ప‌ది రోజుల పాటూ జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ లేని సీన్స్ ను తెర‌కెక్కించ‌నున్నాడ‌ట నీల్. ఎన్టీఆర్ డేట్స్ ను బ‌ట్టి రెండో షెడ్యూల్ ను మొద‌లుపెట్టి అందులో తార‌క్‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నాడు నీల్.

ఈ సెకండ్ షెడ్యూల్ ను నీల్ లెంగ్తీ గానే ప్లాన్ చేశాడ‌ని తెలుస్తోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌ప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వ‌సంత్ ను ఎంపిక చేశార‌ని ఎప్ప‌టినుంచో వార్త‌లొస్తున్నాయి. కానీ దానికి సంబంధించి మేక‌ర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఎన్టీఆర్- నీల్ సినిమా భారీ రేంజ్ లో రానుంద‌ని, ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాలు తారా స్థాయిలో ఉన్నాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వార్2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది కాకుండా దేవ‌ర సీక్వెల్ దేవ‌ర‌2ను కూడా ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది.

Tags:    

Similar News