తారక్.. మరో బిగ్ ఛాన్స్
ఒకప్పుడు మూవీ రూ.100 కోట్లు సాధిస్తేనే గొప్పగా చెప్పుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు రూ.2 వేల కోట్ల క్లబ్ లో చేరేందుకు ఉర్రూతలూగుతున్నాయి మన సినిమాలు.;

రూ.100 కోట్ల క్లబ్.. రూ.200 కోట్ల క్లబ్.. రూ.500 కోట్ల క్లబ్.. రూ.1000 కోట్ల క్లబ్.. రూ.2000 కోట్ల క్లబ్ రోజురోజుకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ మారిపోతోంది. ఒకప్పుడు మూవీ రూ.100 కోట్లు సాధిస్తేనే గొప్పగా చెప్పుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు రూ.2 వేల కోట్ల క్లబ్ లో చేరేందుకు ఉర్రూతలూగుతున్నాయి మన సినిమాలు.
అదే విధంగా బాక్సాఫీస్ వద్ద బెంచ్ మార్క్స్ కు రీచ్ అవ్వాలని ఎప్పటికప్పుడు మన హీరోలు కోరుకుని ఉంటుంటారు. తమ చిత్రాలతో రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తుంటారు. అయితే రూ.500 కోట్ల క్లబ్ లో ఇప్పటికే అనేక మంది హీరోలు చేరిన విషయం తెలిసిందే. ప్రభాస్, అల్లు అర్జున్, విక్కీ కౌశల్, రణబీర్ సహా పలువురు ఇప్పటికే చేరారు.
ఇక టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. రూ.500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నారు. ఆయన గత మూవీ దేవర పార్ట్-1 మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా రాబట్టిన ఆ సినిమా.. రూ.500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టలేకపోయింది
కానీ ఇప్పుడు వార్ 2తో తారక్.. బెంచ్ మార్క్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 2019లో వచ్చి మంచి విజయం సాధించిన వార్ మూవీకి సీక్వెల్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. లీడ్ రోల్ పోషిస్తున్నారు.
తారక్ ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఆగస్టు 14న మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే వార్ -2పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండగా.. బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అదే రోజు రజినీకాంత్ కూలీ మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండటం వల్ల కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కానీ నార్త్ లో మాత్రం వార్-2 డామినేషన్ ఉంటుంది. సౌత్ లో తారక్ నటిస్తుండడంతో ఇక్కడ కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వార్ 2 ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి వసూళ్లు రాబడుతుందో.. ఎన్టీఆర్ రూ.500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.