ఎన్టీఆర్ షేప్ విషయంలో తప్పు చేస్తున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక విషయంలో చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. అందరు హీరోలలా కాకుండా యంగ్ టైగర్ కెరీర్ ప్రారంభం నుంచి తన లుక్‌ను మార్చుకుంటూ వచ్చారు.;

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక విషయంలో చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. అందరు హీరోలలా కాకుండా యంగ్ టైగర్ కెరీర్ ప్రారంభం నుంచి తన లుక్‌ను మార్చుకుంటూ వచ్చారు. ముందు బొద్దుగా కనిపించి డ్యాన్సుల్లోనూ, ఫైట్స్‌లలోనూ ఈజ్‌ని చూపించి ఆశ్చర్యపరిచిన ఎన్టీఆర్ దర్శకుడు కృస్ణవంశీ రూపొందించిన ఎమోషనల్ రివేంజ్ డ్రామా `రాఖీ` వరకు అదే ఫిజిక్‌ని కంటిన్యూ చేస్తూ ఆకట్టుకున్నారు.

అదే సమయంలో ఎన్టీఆర్ ఫిజిక్‌పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి కామెంట్‌లు చేయడం, తనతో సినిమా చేయాలంటే బరువు తగ్గాల్సిందేనని కండీషన్ పెట్టడంతో ఎన్టీఆర్ బరువు తగ్గడం, స్లిమ్‌లుక్‌లోకి మారి `యమదొంగ`లో నటించడం తెలిసిందే. రభస వరకు అదే బాడీని మెయింటైన్ చేసిన ఎన్టీఆర్ టెంపర్ నుంచి పెరగడం మొదలు పెట్టారు. `జనతాగ్యారేజ్` లో కొంత వరకు బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తరువాత కొంత తగ్గారు. అయితే `దేవర` తరువాత ఎన్టీఆర్ ఫిజిక్‌లో డ్రాస్టికల్ ఛేంజ్ కనిపించింది.
ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విధంగా ఎన్టీఆర్ మారిపోవడం, దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటికి రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అదేంటీ ఎన్టీఆర్ ఇలా అయిపోయాడని, ఇంత సన్నగా ఎందుకు మారుతున్నాడా? అని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆరాతీయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ముఖంలో మునుపటి గ్లో కనిపించడం లేదని, ఇలా తగ్గడం ప్రమాదకరం అని వాపోతున్నారు.
అయితే ఎన్టీఆర్ `వార్ 2` తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. దీని కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇంతలా ఎన్టీఆర్ బరువు తగ్గడం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కు అంత మంచిది కాదని, బక్కపలచగా ఎన్టీఆర్ కనిపిస్తే ఆశించి స్థాయిలో పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై క్యారెక్టర్ కనిపించే అవకాశం లేదని ఎన్టీఆర్ అభిమానులు పెదవి విరుస్తున్నారు.
ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపిస్తే ఓ సింహంలా ఉంటాడని, అలాంటి ఆయనని మరీ బక్కపలచకగా చూపించే ప్రయత్నం చేయడం అనేది ఎన్టీఆర్ షేప్ విషయంలో తప్పుచేస్తున్నట్టేనని ఇన్ సైడ్ టాక్. అంతే కాకుండా ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు. మరి ఈ కామెంట్‌లని నీల్ ఎంత వరకు సీరియస్‌గా తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.