అల్లు అర్జున్.. తారక్ ఎందుకు కలవలేదంటే?
ముంబయిలో ప్రస్తుతం వార్-2 కొత్త షెడ్యూల్ జరుగుతోంది. తారక్, హృతిక్ రోషన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి.. బెయిల్ పై హీరో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం బన్నీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
అదే సమయంలో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల శుక్రవారం రాత్రి జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు. శనివారం ఉదయం బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. న్యాయవాదులతో చర్చలు జరిపి తన నివాసానికి చేరుకున్నారు.
ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. దర్శకులు రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు తదితరులు వచ్చి బన్నీతో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాల పై చర్చించారు. హీరో ప్రభాస్.. ఫోన్ లో పరామర్శించారు.
అయితే బన్నీతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. అక్కడ కనిపించలేదు. అల్లు అర్జున్, తారక్ చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరూ కలిసి ఒకసారి కూడా నటించకపోయినా.. మంచి బాండింగ్ మైంటైన్ చేస్తారు. ఒకరినొకరు బావ బావ అని ప్రేమగా పిలుచుకుంటూ తన అప్యాయత చాటుకుంటారు.
సమయం వచ్చినప్పుడల్లా తమ బాండింగ్ కోసం మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు తారక్ ఎందుకు వచ్చి కలవలేదోనని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్-2తో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ముంబయిలో ప్రస్తుతం వార్-2 కొత్త షెడ్యూల్ జరుగుతోంది. తారక్, హృతిక్ రోషన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ కలవలేదని తెలుస్తోంది. ఫోన్ చేసి బన్నీతో ఆయన మాట్లాడారని సమాచారం. ఫోన్ కాల్ లో బావను పరామర్శించి పరిణామాలపై తారక్ చర్చించారట.