తారక్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడా?
ఇటీవల జరిగిన `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ ప్రేక్షకా భిమానుల ముందుకొచ్చేది ఎప్పుడో? ఇప్పుడు మాట్లాడనివ్వండి అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలి సిందే.;

ఇటీవల జరిగిన `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ ప్రేక్షకా భిమానుల ముందుకొచ్చేది ఎప్పుడో? ఇప్పుడు మాట్లాడనివ్వండి అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలి సిందే. తారక్ ఇంతవరకూ ఎన్నో సినిమా వేదికలు పంచుకున్నారు. తన సినిమాలోతో పాటు అన్నయ్య కల్యాణ్ రామ్ ఈవెంట్లు...యంగ్ హీరోల ఈవెంట్లకు అతిధిగా హాజరైన సందర్భాలెన్నో.
కానీ ఏనాడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. దీంతో తారక్ ఏ కారణంగా అలాంటి వ్యాఖ్యలు చేసారంటూ అభిమానుల్లో చర్చకొస్తుంది. త్వరలో జరిగే `వార్ 2` ఈవెంట్ కు ఎలాగూ తారక్ వస్తారు? ఆరోజు అభిమానుల్ని కలుస్తారు కదా? అంతకు మించి ఆలోచించాల్సింది ఏముంది? అన్నది మరికొంత మంది వాదన. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఇప్పుడే మొదలైన నేపథ్యంలో ఇప్పట్లో ఆ సినిమా గురించి మాట్లాడే పనిలేదు.
మరి తారక్ వ్యాఖ్యల వెనుక అసలు అంతరార్దం ఏంటి? అంటే ఓ కొత్త విషయం ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది. ఇకపై తారక్ తన సినిమా ఈవెంట్లు...కల్యాణ్ రామ్ ఈవెంట్లకు తప్ప ఇంతర హీరోల ఈవెంట్లకు హాజరు కాకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకు ఓ బలమైన కారణం కూడా వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో భాగంగా తారక్ లుక్ రివీల్ కాకుండా ఉండకూడదనే ఆ సినిమా రిలీజ్ వరకూ మరే సినిమా ఈవెంట్ కు హాజరు కాకూడదని భావిస్తున్నాడుట.
ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో భాగమవుతాడు తారక్ . ఇప్పటికే తారక్ బాగా సన్నబడ్డాడు. నీల్ సూచన మేరకు అంత సన్నబడాల్సి వచ్చింది. అయితే ఓ రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ అనంతరం తారక్ మళ్లీ బరువు పెరగాల్సి ఉంటుందిట. ఈ నేపథ్యంలో మళ్లీ లుక్ పరంగా చాలా మార్పులు వస్తాయి. ఆ లుక్ బయటకు రివీల్ కాకూడదని నీల్ కండీషన్ పెట్టాడుట. ఈ క్రమంలోనే తారక్ `వార్ 2` తర్వాత మరే సినిమా ఈవెంట్ కు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలి.