ప్రేమతో భుజంపై వాలిన సుక్కు.. ఎమోషన్ అంటున్న తారక్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనందరికీ తెలిసిందే.;

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వారిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్.. సుకుమార్ సతీమణి తబిత ఒకే ఒక్క ఫోటో తో మరోసారి తెలియజేశారు. అందుకు సంబంధించిన పిక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుకుమార్ భుజాన వాలి తారక్ రిలాక్స్ అవుతున్న పిక్ ను తబిత లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. అంతే కాదు.. తారక్ కు ప్రేమతో అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆయనను ట్యాగ్ చేశారు. ఆ తర్వాత అదే పోస్ట్ ను ఎన్టీఆర్ రీ పోస్ట్ చేశారు. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ అంటూ సుకుమార్ ను ట్యాగ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
ఇప్పుడు తారక్ రీ పోస్ట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది. పిక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ ఫోటో అని.. వారి మధ్య ఉన్న బాండింగ్ క్లియర్ గా తెలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో తారక్ అండ్ సుకుమార్ ఫ్యాన్స్ ను తెగ ఆకర్షిస్తోంది. దీంతో వారు ఫుల్ గా షేర్ చేస్తున్నారు.
అయితే సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో మూవీ వచ్చిన విషయం తెలిసిందే. 2016లో రిలీజ్ అయిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీలోని డైలాగునే ఫోటోకు క్యాప్షన్ గా తారక్ ఇవ్వడం విశేషం. ఏదేమైనా ఎన్టీఆర్, సుకుమార్ పిక్ మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
నాన్నకు ప్రేమతో తర్వాత తారక్, సుకుమార్ కాంబో రిపీట్ అవ్వలేదు. దీంతో మళ్లీ ఓ సినిమా తీస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి రిక్వెస్టులు వస్తున్నాయి. అయితే ఓ ప్రాజెక్టు కోసమే సుకుమార్ ఇంటికి ఎన్టీఆర్ వెళ్లారని కొందరు నెటిజన్లు అంటున్నా.. ఇంకొందరు మాత్రం జస్ట్ చిల్ అవ్వడానికి కలిసినట్లు ఉన్నారని చెబుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ వార్-2 మూవీ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేస్తున్నారు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో నిర్మాత నాగ వంశీతో వర్క్ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు, సుకుమార్ పుష్ప-2 అయ్యాక కాస్త రిలాక్స్ అవుతున్నారు. త్వరలోనే రామ్ చరణ్ మూవీతోపాటు పుష్ప-3 వర్క్ ను మొదలుపెట్టనున్నారు. అయితే తారక్, సుక్కు మళ్లీ పని చేస్తారో లేదో వేచి చూడాలి.