తమ్ముడి సినిమాలపై కళ్యాణ్ రామ్ క్లారిటీ!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి.;

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. అందులో మొదటిది హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేసిన వార్2. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ వార్2 లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
ఏప్రిల్ 22 నుంచి నీల్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడని అప్డేట్ కూడా ఇచ్చారు. ఇప్పటికే నీల్- ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ లేని సీన్స్ ను ప్రస్తుతం నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాక షూటింగ్ ను మరింత వేగవంతం చేయనున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.
డ్రాగన్ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి దేవర2 ను చేయనున్నాడు. దేవర రిజల్ట్ ను చూశాక ఎంతోమంది దేవర2 ఉండదనుకున్నారు కానీ రీసెంట్ గా మ్యాడ్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవర2 ఉంటుంది, ఉండి తీరుతుంది అని ఎన్టీఆర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పడంతో దేవర2 ఉందని తేలిపోయింది. నీల్ సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ దేవర2 సెట్స్ లో పాల్గొననున్నాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే నెల్సన్ తో సినిమా వెంటనే ఉంటుందని కొందరంటుంటే, ఆల్రెడీ ఎన్టీఆర్ కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక ఉండే అవకాశముంటుందని మరికొందరంటున్నారు. దీంతో ఈ విషయంపై ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ సినిమా లైనప్ లో ఉన్న డౌట్స్ గురించి కళ్యాణ్ రామ్ ను ప్రశ్నించగా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎన్టీఆర్ ముందుగా ఒప్పుకున్న డ్రాగన్, దేవర2 సినిమాల తర్వాతే నెల్సన్ తో సినిమా ఉంటుందని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ మూవీ ఏప్రిల్18న ప్రేక్షకుల ముందుకు రానుంది.