'వార్‌'లో ఎన్టీఆర్‌ని చూసేది ఎప్పుడంటే..!

అయాన్ ముఖర్జీ సినిమాను విభిన్నంగా ప్రమోషన్ చేస్తాడు అనే పేరు ఉంది. అందుకే వార్ 2 సినిమా నుంచి ఎన్టీఆర్‌ యొక్క లుక్‌ను రివీల్‌ చేయడం కోసం ఆయన మంచి సందర్భం కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

Update: 2025-01-20 05:45 GMT

ఎన్టీఆర్‌ మొదటి బాలీవుడ్‌ మూవీ 'వార్‌ 2' షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఇటీవల హృతిక్‌ రోషన్‌ పాట షూటింగ్‌కి ప్రిపేర్ అవుతున్నట్లుగా పేర్కొన్నాడు. ఎన్టీఆర్‌తో డాన్స్ చేసేందుకు ఎక్కువ కష్టపడుతున్నాను అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌లు తలపడ్డ తీరు అందరికి నచ్చే విధంగా ఉంటుంది అంటున్నారు. ఎన్టీఆర్‌ మొదటి సారి నటించిన బాలీవుడ్ మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో చూస్తామని తెలుస్తోంది. అదే నిజం అయితే కచ్చితంగా వార్‌ 2 సినిమా ఎన్టీఆర్‌లోని నట విశ్వరూపం చూపించడం ఖాయం.

వార్‌ 2 లో ఎన్టీఆర్‌ ఎలా ఉంటాడు అనే విషయమై ఇప్పటి వరకు అధికారికంగా తెలియలేదు. ఆ మధ్య ఒక ఆన్ లొకేషన్ స్టిల్‌ లీక్‌ అయ్యింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు సినిమా నుంచి ఎన్టీఆర్‌ లుక్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వార్‌ 2 లో ఎన్టీఆర్‌ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యాయి అని, పాట చిత్రీకరణతో పాటు ఒకటి రెండు యాక్షన్‌ సన్నివేశాలు పూర్తి చేస్తే వార్‌ 2 టీంకి బైబై చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. షూటింగ్‌ పూర్తి కాక ముందే ఎన్టీఆర్‌ లుక్‌ను రివీల్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని, అందుకే ఒక పోస్టర్‌ను రెడీ చేశారనే వార్తలు బాలీవుడ్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతున్నాయి.

అయాన్ ముఖర్జీ సినిమాను విభిన్నంగా ప్రమోషన్ చేస్తాడు అనే పేరు ఉంది. అందుకే వార్ 2 సినిమా నుంచి ఎన్టీఆర్‌ యొక్క లుక్‌ను రివీల్‌ చేయడం కోసం ఆయన మంచి సందర్భం కోసం వెయిట్‌ చేస్తున్నాడు. మే నెలలో ఎన్టీఆర్‌ పుట్టిన రోజు ఉంది. అప్పటి వరకు ఆగకుండా పోస్టర్‌ను ముందే విడుదల చేయడం ద్వారా ఆయన అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెంచాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్‌ చేశాడని తెలుస్తోంది. అందుకే త్వరలోనే ఎన్టీఆర్‌ వార్‌ 2 లుక్‌ని రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మే నెలలో పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్‌ వార్‌ 2 టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటించారు కనుక వార్‌ 2 కి రెండు టీజర్‌లు విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ దేవర సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వైపు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఈ నెలలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ప్రశాంత్‌ నీల్‌ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే ఆ విషయమై స్పష్టత వస్తుందేమో చూడాలి. ఎన్టీఆర్‌-నీల్‌ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News