దసరా తర్వాత ఎన్టీఆర్‌... వార్‌ 2 కోసం చేసేది ఏంటి?

దేవర సినిమా హిట్‌ నేపథ్యంలో ఎన్టీఆర్‌ తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Update: 2024-10-11 08:30 GMT

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన దేవర సినిమా ఇప్పటి వరకు దాదాపుగా రూ.500 కోట్ల వసూళ్లు వచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని పలు చోట్ల బ్రేక్ ఈవెన్‌ వసూళ్లు నమోదు చేసిందని ప్రకటించారు. దేవర సినిమా హిట్‌ నేపథ్యంలో ఎన్టీఆర్‌ తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఉండబోతుంది.

ఎన్టీఆర్‌ ఇప్పటికే బాలీవుడ్‌ మూవీ 'వార్‌ 2' లో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ వార్‌ 2 లో హృతిక్‌ రోషన్ తో పాటు ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వార్‌ 2 లో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ కాంబోలో ఉండే ప్రతి సీన్‌ పీక్స్ లో ఉంటుందని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వారిద్దరి మధ్య ఫైట్ ఒక యుద్ధం మాదిరిగా ఉంటుంది అంటూ మేకర్స్ నుంచి ఇన్‌పుట్స్ వస్తున్నాయి.

దేవర సినిమాతో మొన్నటి వరకు బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ చాలా రోజుల తర్వాత వార్‌ 2 షూటింగ్‌ కి జాయిన్ అవ్వబోతున్నాడట. దసరా పండుగ తర్వాత వార్‌ 2 కొత్త షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ఆ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్‌ 2 తాజా షెడ్యూల్‌లో హృతిక్‌ రోషన్ తో పాటు ఎన్టీఆర్‌ యాక్షన్‌ సన్నివేశంలో పాల్గొనబోతున్నాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ ను ఇద్దరి కాంబోలో చిత్రీకరించేందుకు గాను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో యశ్‌ రాజ్ స్పై యూనివర్స్‌ నుంచి వచ్చిన సినిమాలు దాదాపు అన్ని మంచి స్పందన దక్కించుకున్నాయి. కనుక వార్‌ 2 ఈజీగా రూ.1500 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. వార్ 2 సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన గెస్ట్‌ గా నటించడం ద్వారా కచ్చితంగా సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న వార్‌ 2 సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. త్వరలోనే వార్‌ 2 సినిమా విడుదల తేదీ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News