దేవర కోసం భైరా.. హై వోల్టేజ్ సీన్స్!
దానికి తోడు ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండడం మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ డైలాగ్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
దానికి తోడు ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండడం మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయితే బ్రేక్ లేకుండా శరవేగంగా కొనసాగుతోంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ను కొన్ని రోజుల క్రితం నుంచి షూట్ చేస్తున్నారు.
అయితే సైఫ్ అలీ ఖాన్ కూడా మరో కీలకమైన షెడ్యూల్లో ఇప్పటినుంచి బిజీ కాబోతున్నాడు. అతని ఎంట్రీ సీన్స్ తో పాటు
జూనియర్ ఎన్టీఆర్ ను ఎదుర్కొనభోయే కొన్ని సీన్స్ ను రేపు హైదరాబాదులో షూట్ చేయబోతున్నారు. ఇక ముంబై నుంచి సోమవారం ఉదయమే సైఫ్ అలీ ఖాన్ వచ్చేశారు. అతను ఈ సినిమాలో భైరా అనే పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్లో కొనసాగుతున్న ఈ సినిమా కథలో జూనియర్ ఎన్టీఆర్ ఒక జా ప్రజలకు చెందిన నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇక అతన్ని ఎదుర్కొనేందుకు భైర కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తాడట. రెండు పాత్రల మధ్యలో వచ్చే సన్నివేశాలు ఊహించని విధంగా ఉంటాయని ఇప్పటికే కొన్ని లీక్స్ ద్వారా అర్థమయింది.
ముఖ్యంగా సముద్రంలో దేవర చేసే పోరాట విన్యాసాలు కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హై విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయట. ఇక మొత్తానికి ఇప్పుడు బైరా కూడా జూనియర్ ఎన్టీఆర్ తో రెగ్యులర్ షూటింగ్లో బిజీ కాబోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేసుకుని రెగ్యులర్ ప్రమోషన్స్ ను అన్ని భాషల్లో తొందరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే.