ఎన్టీఆర్.. ట్యాగ్ మార్చుకున్నాడా?

ఇప్పటివరకు యంగ్ టైగర్ గా పిలువబడే ఎన్టీఆర్ 'దేవర' సినిమా నుంచి అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే పవర్ ఫుల్ ట్యాగ్ అయిన 'మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్' గా పిలవబడుతున్నాడు.

Update: 2024-01-09 05:40 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. నిన్నే ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు.

భారీ విజువల్స్, యాక్షన్ షాట్స్ తో ఈ గ్లింప్స్ ని కట్ చేస్తే దానికి అనిరుద్ ఇచ్చిన బీజీయం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. తాజాగా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ లో ఉన్న ప్రతి షాట్ ని ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే దేవర విషయంలో అభిమానులు ఓ విషయాన్ని నోటీస్ చేశారు. అదేంటంటే, ఈ సినిమాతో ఎన్టీఆర్ తన ట్యాగ్ ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు యంగ్ టైగర్ గా పిలువబడే ఎన్టీఆర్ 'దేవర' సినిమా నుంచి అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే పవర్ ఫుల్ ట్యాగ్ అయిన 'మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్' గా పిలవబడుతున్నాడు. అలా దేవరతో ఎన్టీఆర్ ఓ నయా ట్యాగ్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడనే చెప్పాలి. కాగా ఇప్పటికే ఈ సినిమా 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న దేవర రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన టీ సిరీస్ సంస్థ 'దేవ‌ర' ఆడియో రైట్స్ ను కళ్లుచెదిరే ధరకు కొనుగోలు చేసింది. సుమారు రూ.33 కోట్లు పెట్టి 'దేవర' ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్ లో ఇప్పటివరకు మరే సినిమా ఆడియో రైట్స్ ని ఇంత భారీ మొత్తంలో కొనుగోలు చేసింది లేదు.

ఆడియో రైట్స్ విషయంలో 'దేవర' ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News