ఎన్టీఆర్ సిగ్నల్.. ఆ పార్టీకి ఓటు వేశాడా?

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా కూడా చిన్న పాయింట్ ని పట్టుకొని సోషల్ మీడియాలో దాన్ని పెద్దగా చేసి హడావిడి చేస్తుంటారు.

Update: 2023-12-01 06:17 GMT

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా కూడా చిన్న పాయింట్ ని పట్టుకొని సోషల్ మీడియాలో దాన్ని పెద్దగా చేసి హడావిడి చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో అది కామన్ అయిపోయింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఓ చిన్న పని సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అయి కూర్చుంది. మ్యాటర్ ఏంటంటే..

గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే కదా. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మరీ వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఎన్టీఆర్ ఓటు వేశారు. తారక్ తో పాటూ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి శాలిని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దాదాపు గంటపాటు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడి మరీ సామాన్యుల లాగా తారక్ అండ్ ఫ్యామిలీ ఓటు వేయడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా పోలింగ్ కేంద్రం వద్ద ప్రెస్ వాళ్లు ఎన్టీఆర్ ని ఫోటోలు తీస్తుంటే, 'మీరు ఓటు వేయరా?' అంటూ తారక్ వాళ్లతో చెప్తున్న వీడియో క్లిప్ కూడా పెట్టింట వైరల్ అయింది. అదే సమయంలో ఎన్టీఆర్ ఓ పార్టీకి అనుకూలంగా సైగలు చేశారనే ప్రచారం ఊపందుకుంది.

పోలింగ్ కేంద్ర వద్ద క్యూ లైన్ లో నిలబడి ఉన్న తారక్ తెలిసిన వాళ్ళు కనిపిస్తే తన చేతిని పైకెత్తి హాయ్ చెప్పారు. దాంతో ఎన్టీఆర్ హస్తం గుర్తుకే ఓటు ఓటేయబోతున్నట్లు, ప్రజల కూడా అదే గుర్తుకు ఓటేయాలని సూచిస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. మరికొందరు ఏకంగా ఈ వీడియోకి కాంగ్రెస్ పార్టీ సాంగ్ ని జత చేసి ఎన్టీఆర్ హస్తంకే ఓటేశారని తెగ రచ్చ చేస్తున్నారు.

దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ ఏ పార్టీకి ఓటేశారో కానీ కొందరు మాత్రం ఈ వీడియోతో కాంగ్రెస్ కే ఓటేసినట్లు అర్థం లేని హడావుడి మొదలెట్టేశారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ పార్ట్-1 వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News