హీరోగా మరో యువ ఎన్టీఆర్.. నందమూరి 4వ జనరేషన్!

అలాగే కళ్యాణ్ రామ్ కూడా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

Update: 2024-06-10 11:47 GMT

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ వారసత్వంతో బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. తరువాత హరికృష్ణ కూడా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశారు. హరికృష్ణ వారసత్వంతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.


ఇక నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ తెరంగేట్రం ఈ ఏడాదిలోనే ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని బాలయ్య కన్ఫర్మ్ చేశారు. అలాగే తారకరత్న హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రానించారు. అయితే అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచో నాలుగో తరం వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంట.

ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ కుమారుడు త్వరలో హీరోగా వెండితెరపై కనిపించబోతున్నాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు కావడం విశేషం. వైవిఎస్ చౌదరి ఈ యంగ్ ఎన్టీఆర్ ని పరిచయం చేస్తున్నారు. అఫీషియల్ గా ప్రాజెక్టు పై క్లారిటీ ఇచ్చేశారు. గతంలో వైవిఎస్ రామ్ పోతినేని లాంటి హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఆయన కూడా చాలా కాలం తరువాత డైరెక్టర్ గా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు హరికృష్ణ ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాకుండా మూడో తరం హీరోగా మరో యంగ్ ఎన్టీఆర్ రాబోతున్నాడు.

మొత్తానికి ఇండస్ట్రీలో అత్యధిక ఉన్న ఫ్యామిలీ ట్రీ అంటే మెగా ఫ్యామిలీ అవుతుంది. ఆ తరువాత నందమూరి వారసుల డామినేషన్ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ ఫ్యామిలీలో ఇంకా హీరోలు అందరూ మూడో జెనరేషన్ లో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నాలుగో జనరేషన్ లోకి వచ్చేసింది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా మూడో జెనరేషన్ హీరోగా రమేష్ బాబు తనయుడు తెరంగేట్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ రెండేళ్లలో అతను గ్రాండ్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. వారసత్వంతో రాబోయే ఈ హీరోలు భవిష్యత్తులో టాలీవుడ్ లో ఏ విధంగా చక్రం తిప్పుతారు అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఇక యంగ్ ఎన్టీఆర్ ఎంట్రీపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది కూడా కూడా ఇంటరెస్టింగ్ గా మారింది.

Tags:    

Similar News