ఓదెల 2: మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందంటే..
అలాగే ఈ సినిమాలో వశిష్ఠ సింహ, సంపత్ నందిలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తమన్నా అన్నారు.;

ఓదెల 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో శివశక్తి అనే శక్తిమంతమైన పాత్రలో తమన్నా కనిపించనుండటం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్‌కు అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ముఖ్యంగా తమన్నా గెటప్, దైవంతో కూడిన కథాంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను డి. మధు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది.
ఇక ఇటీవల ముంబైలోని ప్రముఖ గైటీ గెలాక్సీ థియేటర్‌లో తెలుగు, హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌లో తమన్నా మాట్లాడుతూ, "ఇలాంటి పవర్ఫుల్ పాత్రను ఊహించి నా మీద నమ్మకం ఉంచిన రచయిత సంపత్ నంది గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా చూస్తే మనలోనే ఉన్న దైవత్వాన్ని బయటకు తీస్తుంది. ఈ ప్రపంచంలో దేవుడిని ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు" అని చెప్పారు.
అలాగే ఈ సినిమాలో వశిష్ఠ సింహ, సంపత్ నందిలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తమన్నా అన్నారు. భారీ బడ్జెట్‌తో ఈ కథను కమర్షియల్ స్టైల్‌లో నిర్మించిన నిర్మాత మధుగారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన పాత్రకు సంబంధించిన ఇంటెన్సిటీని స్క్రీన్‌పై చూపించేందుకు తాను చేసిన కృషిని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందని తెలిపారు.
వశిష్ఠ సింహ మాట్లాడుతూ, తమన్నా పాత్ర పట్ల చూపిన డెడికేషన్‌కు ఆయన ఫిదా అయ్యారట. "షూటింగ్ సమయంలో ఆమె పూర్తిగా పాత్రలో లీనమయ్యారు. థియేటర్‌లో సినిమా చూస్తే ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు" అని చెప్పారు. సంపత్ నంది మాట్లాడుతూ, తమన్నా తన పాత్ర కోసం షూటింగ్ మొత్తం టైమ్‌లో నాన్ వెజ్ తినకుండా, పూజా మూడ్‌లో ఉండి, పూర్తిగా శివశక్తిగా మారిపోయారన్నారు. ఆమె అద్భుతమైన నటన ఈ సినిమాకు బలంగా నిలుస్తుందని తెలిపారు.
సంపత్ నంది సినిమా గురించి మాట్లాడుతూ, "ఓదెల 2 సినిమాకు ప్రేక్షకులు థియేటర్‌లో ఓ అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఇది కచ్చితంగా బిగ్ హిట్ అవుతుంది" అని ధీమాగా చెప్పారు. ఈ సినిమా కోసం అశోక్ తేజ కథనాన్ని డిఫరెంట్ గా తెరకెక్కించారని అన్నారు. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదలవుతున్న ఈ సినిమా ధియేటర్స్‌లో విడుదలకై సిద్ధమవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భక్తి అంశాలతో కూడిన ఈ సినిమా ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు.