ఓజీ 2025 లో రిలీజ్ కాకపోతో భారీ నష్టం!
`ఓజీ` రిలీజ్ విషయంలో నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అవుతుందా? లేక వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా?;

`ఓజీ` రిలీజ్ విషయంలో నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అవుతుందా? లేక వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా? అన్నది సందేహంగా మారింది. జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన `హరిహరవీరమల్లు` అటుపై మార్చికి వాయిదా పడటం? అక్కడ నుంచి మే 9కి వాయిదా పడటం తెలిసిందే. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు డేట్లు ఇవ్వకపోవడం వల్ల ఇంత డ్రామా నడించింది.
అలాంటింది `ఓజీ` విషయంలో ఇంకెంత డ్రామా నడుస్తుందో ఆ పెరు మాళ్లకే తెలియాలి. ఈ సినిమాకు ఇంకా పవన్ 14 రోజులు డేట్లు ఇస్తే షూటింగ్ పూర్తవుతుంది. లేదంటే? ముగించే పరిస్థితి లేదు. ఇప్పుడా 14 రోజులు పీకే ఎప్పుడు కేటాయిస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏ నెలలో డేట్లు ఇస్తాడు? అన్న దానిపై స్పష్టత లేదు. దీంతో రిలీజ్ ఈ ఏడాది ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలుకూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈసినిమాకి సంబంధించి ఇప్పటికే ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. సదరు ఓటీటీ సంస్థ షెడ్యూల్ ప్రకారం ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి పెట్టుకుంది. అంటే సినిమా సెప్టెంబర్ లోపు రిలీజ్ అయ్యేలా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ఈలోగా సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అవ్వక పోతే గనుక నిర్మాతకు నష్టం తప్పదనే వార్త వినిపిస్తుంది.
సెప్టెంబర్ తర్వాత రిలీజ్ ప్లాన్ చేసుకుంటే గనుక ఓటీటీ నిబంధనలు మీరినట్లు అవుతుందని...అప్పుడు కండీషన్ ప్రకారం నిర్మాత జేబుకు చిల్లు తప్పదని ..అదనంగా ఆయనే చెల్లించాల్సి ఉంటుందని అంటు న్నారు. ఎందుకంటే ఓజీని ఓటీటీలో ఓ ప్రైమ్ రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుందిట. ఒక వేళ ఓజీ ఆప్రైమ్ రిలీజ్ తేదిని కోల్పోతే గనుక తమకు నష్టం వాటిల్లుతుందని సదరు ఓటీటీ సంస్థ భావిస్తుందిట.
ఆ నష్టాన్నినిర్మాత నెత్తిన వేయాలన్నది ప్లాన్ గా కనిపిస్తుంది. అంటే నిర్మాత ఆ నష్టం నుంచి తప్పించు కోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లోగా `ఓజీ`ని థియేటర్లో రిలీజ్ చేయాలి. అప్పుడే ఓటీటీ థ్రెట్ నుంచి బయట పడినట్లు. అసలే నిర్మాతలు ఓటీటీ చేతుల్లో కీలు బొమ్మగా మారుతున్న సంగతి తెలి సిందే. డీల్ క్లోజింగ్ విషయంలో ఓటీటీలు అనుసరిస్తోన్న వ్యూహానికి నిర్మాతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది.