ఓం భీమ్ బుష్.. పర్ఫెక్ట్ వెడ్డింగ్ సాంగ్ ఆగయా!
హుషారు ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి.. ప్రస్తుతం ఓం భీమ్ బుష్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
హుషారు ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి.. ప్రస్తుతం ఓం భీమ్ బుష్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బ్రోచేవారెవరురా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ ట్రియోనే ఈ సినిమాలో కూడా నటిస్తోంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో స్పెషల్ సాంగ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ తోపాటు ఫస్ట్ సింగిల్ కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆడియన్స్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. మరోసారి సూపర్ హిట్ ట్రియో కామెడీని ఆనందించడానికి మూవీ లవర్స్ సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో మూవీ టీమ్ చేస్తున్న వెరైటీ ప్రమోషన్లకు అట్రాక్ట్ అవుతున్నారు. కచ్చితంగా సినిమా చూస్తామని చెబుతున్నారు.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. తాజాగా ది వెడ్డింగ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. కృష్ణకాంత్ ఈ పాట కోసం రాసిన లిరిక్స్ లో వివాహా ఆచారాలను చక్కగా వివరించారు. కపిల్ కపిలన్ తన గాత్రంతో ప్రాణం పోశారు.
హే పీపీ డుమ్ డుమ్ మోతే మోగే కళ్యాణమే అంటూ సాగుతున్న ఈ పాట.. మ్యారేజేస్ కోసం పర్ఫెక్ట్ సెలక్షన్ అవ్వనుంది. లిరికల్ సాంగ్ లో విజువల్స్ చాలా కూల్ గా ఆకట్టుకుంటున్నాయి. కపిల్ గాత్రంతోపాటు కోరస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సన్నీ ఎంఆర్ తన మ్యూజిక్ తో ఓ రేంజ్ లో అలరించారు. వయోలిన్, గిటార్ తో ఇచ్చిన కృతులు పెళ్లి వైబ్స్ ను గుర్తుతెస్తున్నాయి. ఫస్ట్ సింగిల్ లానే ఈ వెడ్డింగ్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా మారనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. తోట రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ కాగా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. గత ఏడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శితో కలిసి మరో హిట్ కొట్టడం పక్కా అని సినీ పండితులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.