ఆస్కార్‌ 2025 నామినేషన్స్‌ లిస్ట్‌

ఎట్టకేలకు ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించారు.

Update: 2025-01-24 06:09 GMT

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్‌ 2025 నామినేషన్స్‌ లిస్ట్‌ను అకాడమీ అధికారికంగా వెళ్లడించింది. లాస్ ఏంజిల్స్‌లో గత కొన్ని వారాలుగా కారు చిచ్చు కారణంగా అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది హాలీవుడ్‌ ఫిల్మ్‌ స్టార్స్, ఫిల్మ్‌ మేకర్స్ వేరే ప్రాంతాలకు వలస వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా ఆస్కార్ కార్యక్రమాలు నిర్వహించేది సైతం అక్కడే కావడంతో అసలు ఆస్కార్‌ అవార్డులు ఈ ఏడాది ఉంటాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆస్కార్‌ అవార్డు వేడుక రద్దు కాదని అకాడమి పలు సార్లు ప్రకటనలు చేసింది.

ఎట్టకేలకు ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ నామినేషన్‌లో 'అనుజ' అనే హిందీ సినిమాకు బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో నామినేషన్ దక్కింది. పలు ఇంగ్లీష్‌ సినిమాలతో ఈ సినిమా పోటీ పడాల్సి ఉంది. జనవరి 17న ప్రకటించాల్సిన ఈ నామినేషన్స్‌ను రెండు సార్లు వాయిదా వేసి చివరికి జనవరి 23న ప్రకటించారు. నామినేషన్స్‌లో ఉన్న వారిలో కేటగిరికి ఒకరు చొప్పున ఆస్కార్‌ అవార్డును అందుకోబోతున్నారు. మార్చి నెలలో అవార్డు వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. కారుచిచ్చు ప్రభావం ఉంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు అంటున్నారు.

గత ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట నిలిచింది. అయితే అవార్డు వస్తుందా లేదా అనే అనుమానాలు ఉండేవి. చివరికి ఇండియాకు మొదటి ఆస్కార్‌ అవార్డు దక్కింది. తెలుగు సినిమాలోని తెలుగు పాటకు ఆస్కార్‌ రావడం గర్వించదగ్గ విషయం. అయితే ఈసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే కాదు బాలీవుడ్‌ నుంచి పెద్దగా ఎంట్రీలు దక్కించుకోలేదు. వచ్చే ఏడాది వరకు ఇండియన్ సినీ ప్రేక్షకులు మరో ఆస్కార్‌ కోసం వెయిట్‌ చేయాల్సిందే.

ఉత్తమ నటుడు కేటగిరీ నామినేషన్స్‌ :

అడ్రియన్ బ్రాడీ- ది బ్రూటలిస్ట్

తిమోతీ చలమెట్ – ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌

కోల్మన్ డొమింగో- సింగ్ సింగ్

రాల్ఫ్ ఫియన్నెస్- కాన్క్లేవ్

సెబాస్టియన్ స్టాన్ – ది అప్రెంటిస్

ఉత్తమ నటి కేటగిరీ నామినేషన్స్‌ :

సింథియా ఎరివో- విక్డ్

కార్లా సోఫియా గాస్కోన్- ఎమిలియా పెరెజ్

మిక్కీ మాడిసన్- అనోరా

డెమి మూర్ – ది సబ్ స్టాన్స్

ఫెర్నాండా టోర్రెస్- ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌

ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం కేటగిరీ నామినేషన్స్‌ :

ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌ (బ్రెజిల్)

ది గర్ల్ విత్ ది నీడిల్ (డెన్మార్క్)

ఎమిలియా పెరెజ్ (ఫ్రాన్స్)

ది సీడ్ ఆఫ్ ది సేక్రేడ్ ఫిగ్ (జర్మనీ)

ప్రవాహం (లాట్వియా)

ఉత్తమ చిత్రం కేటగిరీ నామినేషన్స్‌ :

అనోరా

ది బ్రూటలిస్ట్‌

ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌

కాన్‌క్లేవ్‌

డ్యూన్‌: పార్ట్‌2

ఎమిలియా పెరెజ్‌

ఐయామ్‌ స్టిల్‌ హియర్‌

నికెల్‌ బాయ్స్‌

ది సబ్‌స్టాన్స్‌

విక్డ్‌

ఉత్తమ దర్శకుడు కేటగిరీలో నామినేషన్స్‌ :

షాన్ బేకర్ (అనోరా)

బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్‌)

జేమ్స్‌ మ్యాన్‌గోల్డ్‌ (ది కంప్లీట్‌ అన్‌నోన్‌)

జాక్వెస్ ఆడియార్డ్(ఎమిలియా పెరెజ్)

కార్లే ఫర్జెట్(ది సబ్‌స్టాన్స్)

Tags:    

Similar News