ఆస్కార్ 2025: ఆ మూడు తెలుగు సినిమాలపై ఉత్కంఠ
ఇప్పుడు అదే ఉత్సాహంతో ఆస్కార్ ఉత్సవాల్లో పార్టిసిపేషన్ పెరిగింది.
ఆస్కార్స్ 2025 బరిలో నిలవడమే గాకుండా అవార్డును కొల్లగొట్టింది RRR. రామ్ చరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఆస్కార్ గెలుచుకున్న మొదటి తెలుగు చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా వేవ్స్ క్రియేట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ నుంచి `నాటు నాటు..` ట్రాక్ ప్రతిష్టాత్మకమైన ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది. ఒరిజినల్ పాట కేటగిరీలో మొదటి భారతీయ చిత్రంగా కూడా ఆర్.ఆర్.ఆర్ గుర్తింపు పొందింది.
ఇప్పుడు అదే ఉత్సాహంతో ఆస్కార్ ఉత్సవాల్లో పార్టిసిపేషన్ పెరిగింది. భారతీయ సినీపరిశ్రమల నుంచి పలు సినిమాలు ఈసారి కూడా ఆస్కార్స్ బరిలోకి దిగుతున్నాయి. 2024 లో తెరకెక్కిన వాటిలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫైనల్ లిస్ట్‌లో ఏ తెలుగు సినిమా చోటు దక్కించుకోని సంగతి తెలిసిందే. కానీ ఆస్కార్ 2025పై హోప్స్ చాలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది అధికారిక ప్రవేశం కోసం మూడు తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి.
ప్రభాస్ నటించిన `కల్కి 2898 AD`, తేజ సజ్జ `హను -మాన్`, పాయల్ రాజ్‌పుత్ `మంగళవారం` పోటీబరిలో ఉన్నాయి. వీరిలో ఎవరైనా ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి సినిమాలు కూడా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో పోటీ పడుతున్నాయి. 2 మార్చి 2025న ఆస్కార్ వెళ్లే సినిమా ఏది? అనేది వెల్లడవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల కు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఎంపిక చేసిన తుది చిత్రం ఏది? అనేది వెల్లడిస్తుంది. సినీ ప్రేమికులు పెద్ద ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.