ఓటీటీ రిలీజ్ ల‌కు ఫిలింఫేర్ అవార్డులు!

ఆ ఏడాది రిలీజ్ అయిన మంచి చిత్రాల‌న్నింటికి అవార్డుల‌తో గౌర‌వించ‌డం అన్న‌ది ఓ అన‌వాయితీగా వ‌స్తుంది.

Update: 2024-11-27 23:30 GMT

ఏటా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మంగా ఎంత ఘ‌నంగా జ‌రుగుతుందో తెలిసిందే. ఆ ఏడాది రిలీజ్ అయిన మంచి చిత్రాల‌న్నింటికి అవార్డుల‌తో గౌర‌వించ‌డం అన్న‌ది ఓ అన‌వాయితీగా వ‌స్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ అవార్డులు థియేట‌ర్ లో రిలీజ్ అయిన చిత్రాల‌కే ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలకు కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఇస్తుంది. దానికో కార‌ణంగా ఉంది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో నే రిలీజ్ అవుతున్నాయి.

థియేట‌ర్ లో వివిధ కార‌ణాల‌తో రిలీజ్ అవ్వ‌డం లేదు. ఓటీటీలో రిలీజ్ అయిన మంచి సినిమాల‌కు రివ్యూలు క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తున్నాయి. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ బాగుంటుంది. ఇవ‌న్నీ ప‌రిగ‌ణించే ఫిలిం ఫేర్ అవార్డులు ఓటీటీ రిలీజ్ ల‌కు కూడా అందిస్తుంది. తాజాగా వివిధ కేటగిరిల్లో పోటీ పడే సిరీస్‌లు, సినిమాల నామినేషన్ లిస్ట్‌ను ఫిల్మ్‌ఫేర్ విడుదల చేసింది.

ఇందులో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి:ది డైమండ్ బజార్’ 16 కేటగిరీస్‌లో నామినేట్ అయింది. ఉత్తమ సిరీస్ నామినేషన్స్: కాలా పానీ, కోట ఫ్యాక్టరీ (సీజన్ 3), మేడ్ ఇన్ హెవెన్ (సీజన్ 2), ముంబయి డైరీస్ (సీజన్ 2), ది రైల్వేమెన్,

ఉత్తమ నటి నామినేషన్స్: హ్యూమా ఖురేషి (మహారాణి సీజన్ – 3). కొంకణ సేన్ శర్మ (ముంబాయి డైరీస్ -3), మనీషా కొయిరాలా (హీరామండి:ది డైమండ్ బజార్), శోభిత ధూళిపాళ్ల (మేడ్ ఇన్ హెవెన్ 2), సోనాక్షి సిన్హా (హీరామండి: ది డైమండ్ బజార్), సుస్మిత సేన్ (తాళి).

ఉత్తమ దర్శకుడు నామినేషన్స్: అభిషేక్ చౌబే (కిల్లర్ సూప్), నిఖిల్ అడ్వాణీ (ముంబయి డైరీస్ 2), ప్రతీశ్ మెహతా (కోటా ఫ్యాక్టరీ – సీజన్ 3), రాజ్ అండ్ డీకే (గన్స్ అండ్ గులాబ్స్), సమీర్ సక్సేనా,అమిత్ గోలానీ (కాలా పానీ), సంజయ్ లీలా భన్సాలీ (హీరామండి:ది డైమండ్ బజార్), శివ రౌలి (ది రైల్వేమెన్). ఉత్తమ నటుడు నామినేషన్స్: అర్జున్ మాథూర్ (మేడ్ ఇన్ హెవెన్ – సీజన్ 2), గగన్ దేవ్ రియా (స్కామ్ 2003 ది తెల్గీ స్టోరీ), కేకే మేనన్ (బొంబయ్ మేరీ జాన్), ప్రియాన్షు పైనులి (శేఖర్ లఖోట్), రితేశ్ దేశ్‌ముఖ్ (పిల్), సూర్య శర్మ (ఉండేఖి – సీజన్ 3).

Tags:    

Similar News