ఓటీటీలో ఈ వారం.. టాప్ మూవీస్ ఇవే..

హీరో అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ మూవీ బడ్డీ.. నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

Update: 2024-08-30 16:53 GMT

ప్రతి వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు నయా మూవీస్, సిరీసులతో నిర్వాహకులు.. ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. పోటీపడి మరీ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే తెలుగు వారు మాత్రం ఓటీటీ రిలీజ్ లిస్ట్ వస్తే చాలు.. ఎన్ని టాలీవుడ్ మూవీస్ ఉన్నాయో చూసుకుంటారు. అలా ఈ వీకెండ్ లో ఓటీటీలోకి ఎక్కువగా తెలుగు సినిమాలే వస్తున్నాయి/వచ్చాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

హీరో అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ మూవీ బడ్డీ.. నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా కొన్ని రోజుల క్రితం థియేటర్లో రిలీజ్ అవ్వగా.. అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన శివం భజే మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ పురుషోత్తముడు ఆహా లో ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. యాక్టర్ రాజా రవీంద్ర నటించిన సారంగదరియా చిత్రం.. ఆగస్టు 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ఆహాలో ఆగస్ట్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది థియేటర్లలో విడుదలైన తమిళ డబ్బింగ్ చిత్రం దీపావళి.. ఇప్పుడు ఈటీవీ విన్ లో ఆగస్టు 29వ తేదీన అందుబాటులోకి వచ్చింది.

హాలీవుడ్‌ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫాంటసీ యాక్షన్ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్ ఇప్పుడు జియో ఓటీటీలో ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాందహార్ ప్లేన్ హైజాక్ పై రూపొందించిన ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజ జీవిత కథలను ఆధారంగా రూపొందిన క్యాడెట్స్ సిరీస్.. ఆగస్ట్ 30 నుంచి జియోలో అందుబాటులోకి వచ్చింది.

ఫాంటసీ అండ్ అడ్వెంచర్ వెబ్ సిరీస్ లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ రెండో సీజన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. KAOS సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. అలా ఈ వీకెండ్ ను ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలు, ఒక డబ్బింగ్ మూవీ, పలు వెబ్ సిరీస్ లతో ఓటీటీ లవర్స్ ఎంజాయ్ చేయవచ్చు. సడెన్ గా మరేమైనా మూవీలు, సిరీసులు కూడా రావొచ్చు. మరి మీరు ఏది చూసేందుకు సిద్ధమయ్యారు?

Tags:    

Similar News