ఓవర్సీస్ లో బాద్ షా ఎవరంటే?

తెలుగు, హిందీ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ లో కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో దర్శకులు మూవీస్ చేస్తూ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కథలని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.

Update: 2024-12-29 07:30 GMT

ఇండియన్ సినిమాలు గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాయి. భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న స్టార్ హీరోల సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. తెలుగు, హిందీ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ లో కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో దర్శకులు మూవీస్ చేస్తూ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కథలని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.

అందుకే ఓవర్సీస్ ఆడియన్స్ ఇండియన్ సినిమాలకి పట్టం కడుతున్నారు. భారీ కలెక్షన్స్ ఇస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ఓవర్సీస్ లో 29 మిలియన్ డాలర్స్ వరకు కలెక్ట్ చేసింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళని ‘కల్కి 2898ఏడీ’ అందుకుంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో 31.6 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది.

దీని తర్వాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ నిలిచింది. అయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాలు చూసుకుంటే ఓవర్సీస్ బాక్సాఫీస్ బాద్ షా గా షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో 50 మిలియన్ డాలర్స్ కి దగ్గరగా కలెక్షన్స్ అందుకున్నాయి.

తరువాత అత్యధిక కలెక్షన్స్ డార్లింగ్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ‘బాహుబలి 2’ పేరు మీద ఉన్నాయి. ఈ సినిమాకి ఓవరాల్ గా 44 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. నాలుగో స్థానంలో కూడా ప్రభాస్ ఉన్నారు. ‘కల్కి’ మూవీతో ఆయన ఓవర్సీస్ మార్కెట్ లో తన స్టామినా చూపించారు. టాప్ 5 లోకి ‘పుష్ప 2’ మూవీ దూసుకొచ్చింది. దీని తర్వాత 27 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఉంది.

అయితే ఓవర్సీస్ మార్కెట్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే హీరోలుగా షారుఖ్ ఖాన్, డార్లింగ్ ప్రభాస్ మాత్రమే ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఇప్పటికే 50 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరి తనకి తిరుగులేదని ప్రూవ్ చేశారు. ఇక ప్రభాస్ కూడా నెక్స్ట్ రాబోయే సినిమాలతో 50 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరడం ఖాయం అనుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇదే క్రేజ్ ని కొనసాగిస్తే మాత్రం నెక్స్ట్ పొజిషన్ లో ఉంటాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.

జవాన్ - 48 మిలియన్ డాలర్స్

పఠాన్ - 46 మిలియన్ డాలర్స్

బాహుబలి 2 - 44 మిలియన్ డాలర్స్

కల్కి 2898ఏడీ - 31.6 మిలియన్ డాలర్స్

పుష్ప 2 ది రూల్ - 29 మిలియన్ డాలర్స్

కేజీఎఫ్ చాప్టర్ 2 - 27 మిలియన్ డాలర్స్

Tags:    

Similar News