గ్లింప్స్ సీజీకే కోటి మరి సినిమాకు ఎంత ఖర్చు చేస్తారో?
`దసరా` పాన్ ఇండియా హిట్‌తో నానిని వంద కోట్ల క్లబ్‌లో చేర్చిన శ్రీకాంత్ 'ది ప్యారడైజ్'ని ఓ రేంజ్‌లో తెరపైకి తీసుకురాబోతున్నాడు.;

ఈ మధ్య సినిమా కాన్సెప్ట్‌ని బట్టి గ్లింప్స్‌లు చేయడం అలవాటుగా మారింది. దీని కోసం కొంత మంది డైరెక్టర్లు నామినల్‌గా ఖర్చు చేస్తుంటే మరి కొంత మంది డైరెక్టర్లు మాత్రం భారీగా ఖర్చు చేస్తున్నారు. దాంతో షూటింగ్‌కు ముందే ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేస్తున్నారు. ఈ విషయంలో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ముందు వరుసలో నిలుస్తున్నాడు. 'దసరా' సినిమాతో దర్శకుడిగా గుర్తింపుని సొంతం చేసుకున్న శ్రీకాంత్ మరో సారి నానితో భారీ సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
`దసరా` షూటింగ్‌కు ముందు గ్లింప్స్‌ని రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో చేస్తున్న `ది ప్యారడైజ్` మూవీకి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. `దసరా` పాన్ ఇండియా హిట్‌తో నానిని వంద కోట్ల క్లబ్‌లో చేర్చిన శ్రీకాంత్ 'ది ప్యారడైజ్'ని ఓ రేంజ్‌లో తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ని విడుదల చేయడం తెలిసిందే.
'రా ట్రూత్ రా ల్యాంగ్వేజ్' పేరుతో విడుదల చేసిన గ్లింప్స్,అందులో వాడిన రా కంటెంట్ ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా ఆడియన్స్‌లోనూ చర్చకు దారితీసింది. లేడీ వాయిస్‌తో నాని క్యారెక్టర్‌ని తెలియజేస్తూ రూపొందించిన గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఓ వర్గం కోసం నాయకుడిగా నిలబడిన ఓ యువకుడి కథగా ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నట్టుగా గ్లింప్స్‌ని బట్టి స్పష్టమైంది. అయితే ఈ గ్లింప్స్ సీజీ కోసం మేకర్స్ ఏకంగా కోటి ఖర్చు చేశారట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ గ్లింప్స్‌ని మొత్తం సీజీలోనే రూపొందించారు. దీంతో దీని కోసం కోటి పైనే ఖర్చు చేయాల్సి వచ్చిందట. మరి గ్లింప్స్‌కే కోటి ఖర్చు చేస్తే సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారో అనే చర్చ మొదలైంది. 'దసరా'తో భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్‌పై ఉన్న నమ్మకంతో నిర్మాత చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారని తెలిసింది. మ్యాక్సిమమ్ మ్యాడ్‌నెస్ ఉండే ఈ మూవీ నాని నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడుతుందో వేచి చూడాల్సిందే.