ఫోటో స్టోరి: మాల్దీవ్స్‌లో 'పారి'జాతం

నిరంత‌రం ఒక‌రితో ఒక‌రుగా ప్రేమైక ఆనందంలో ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

Update: 2024-10-02 03:00 GMT

పారి అలియాస్ పరిణీతి చోప్రా రాజ‌కీయ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌ద్దాను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత ఈ జంట గోల్స్ ఇత‌రుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. నిరంత‌రం ఒక‌రితో ఒక‌రుగా ప్రేమైక ఆనందంలో ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.


తాజాగా మాల్దీవుల నుంచి స్పెష‌ల్ ఫోటో ఆల్బమ్ విడుద‌లైంది. పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మాల్దీవులకు వెళ్లారు. మంగళవారం పరిణీతి తమ వెకేష‌న్ నుండి రాఘవ్ పాస్‌పోర్ట్ ఫ్లెక్స్, సుందరమైన ప్రదేశాలను షేర్ చేసింది. ``అందమైన రిసార్ట్, అందమైన అబ్బాయి.. నేను... అద్భుతమైన 48 గంటల వేకే కోసం జోయాలీకి ధన్యవాదాలు! `` అని రాసింది పరిణీతి.


బీచ్‌లో సూర్యుడి ఎండ‌లో... సైకిళ్లు తొక్కుతూ ... మిర్రర్ సెల్ఫీ ల‌తో ఒక‌టే సంద‌డి చేసారు ఇద్ద‌రూ. పరిణీతి తన రిసార్ట్‌లో ఆస్వాదించిన రుచికరమైన ఆహారాన్ని.. మసాజ్ రూమ్ నుండి దృశ్యాన్ని కూడా ఫోటోలు వీడియోల‌తో డాక్యుమెంట్ చేసింది. పరిణీతి షేర్ చేసిన ఫోటోలలో పారితో పాటు రాఘవ్ పాస్‌పోర్ట్ ఉంది. పారీ భారతీయులందరిలాగే సాధారణ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండగా.. రాజ్యసభ ఎంపీ అయిన రాఘ‌వ్‌కి దౌత్య ప‌ర‌మైన‌ పాస్‌పోర్ట్ ఉంది. అటువంటి పాస్‌పోర్ట్‌లు దౌత్య హోదా కలిగిన వ్యక్తులకు లేదా విదేశాలలో అధికారిక విధుల కోసం భారత ప్రభుత్వంచే నియమితుల‌వుతారు. ఇది విదేశాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు వేగవంతమైన ప్రయాణం, దౌత్యపరమైన శక్తి , వీసా ప్రయోజనాలను క‌లిగి ఉండ‌వ‌చ్చు.


మొదటి వార్షికోత్సవం

పరిణీతి- రాఘవ్ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని మాల్దీవులలోని తెల్లటి ఇసుక బీచ్‌లు నీలం సముద్రం మధ్య ప్రశాంతమైన వెకేష‌న్ ని ఆనందించారు. అంతకుముందు ద్వీప దేశంలో ఈ జంట బీచ్ ఒడ్డున కూర్చుని పానీయాలు ఆస్వాధిస్తున్న ఫోటో ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాధించిన మరొక ఫోటోని షేర్ చేసారు. గత సంవత్సరం సెప్టెంబర్ 24 న పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల‌ సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

Tags:    

Similar News