జనవరి అంటేనే సినిమా పండగన్న సీనియర్ రైటర్..!
సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ సంక్రాంతి సినిమాల పండగ గురించి రీసెంట్ గా స్పందించారు.
సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ సంక్రాంతి సినిమాల పండగ గురించి రీసెంట్ గా స్పందించారు. సంక్రాంతి వచ్చింది అంటే స్టార్ సినిమాల సందడి తెలిసిందే. ప్రతి సంక్రాంతికి స్టార్ సినిమాలు రిలీజ్ అవ్వడం అవి హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్ కొట్టడం జరుగుతుంది. అందుకే సంక్రాంతి పండగ సినీ పరిశ్రమకు చాలా స్పెషల్ అని అంటారు. ఐతే ఇదే విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ ప్రత్యేకంగా చెప్పారు.
జనవరి నెల సినిమాలకు ఒక వరం లాంటిదని ఆయన అన్నారు. జనవరి నెలలో అది సంక్రాంతికి సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయని అన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల గురించి కూడా పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ఈ క్రమంలో రైటర్ గా వారు చేసిన సినిమాలు జనవరి నెలలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయని అన్నారు. దాదాపు 40 సినిమాల దాకా సంక్రాంతి సీజన్ కి వచ్చాయని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.
అంతేకాదు ఆయన పనిచేసిన స్టార్ హీరోల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు పరుచూరి గోపాలకృష్ణ. సంక్రాంతికి సంసార బంధం సినిమా రిలీజైందని. ఆ సినిమా తర్వాత మా ఇద్దరి పేర్లను పరుచూరి బ్రదర్స్ గా ఎన్టీఆర్ మార్చారని గుర్తు చేసుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి బ్రదర్స్ అన్న పేరు పెట్టినప్పటి నుంచి తాము తిరిగి చూసుకోకుండా ఘన విజయాలు అందుకున్నామని అన్నారు.
సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ అగ్నిపర్వతం. చిరంజీవి చట్టంతో పోరాటం. హరీష్ నటించిన ప్రేమఖైదీ 1993 లో చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమా కూడా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఐతే ప్రస్తుతం ఆయన పరుచూరి పలుకులు అంటూ సినిమాల గురించి తన వ్యూ చెబుతూ వస్తున్నారు.
ఒక సినిమా కమర్షియల్ గా హిట్ అయినా ఒకవేళ వర్క్ అవుట్ కాకపోయినా ఆయన మార్క్ విశ్లేషణతో పరుచూరి గోపాలకృష్ణ అలరిస్తుంటారు. సీనియర్ రైటర్ గా కథలో లోపాలు.. కథనంలో దిద్దుబాట్లని సున్నితంగా చెబుతూ రాబోయే తరాలకు కథా విశ్లేష్ణ.. కథా సంపుటిగా పరుచూరి పలుకులు ఉపయోగపడేలా చేస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ సినిమా విశ్లేషణలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది.