Begin typing your search above and press return to search.

అత‌డిపై దాడి ఆరోప‌ణ‌లు నిరాధారం.. ఖండించిన న‌టి

ఫిర్యాదు కాపీ ప్రకారం KJR స్టూడియోస్‌లో హెల్పర్‌గా పనిచేసిన సుభాష్‌ను 2022లో పార్వతి త‌న‌ నివాసంలో ఇంటి పని చేయమని అడిగారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 11:30 PM GMT
అత‌డిపై దాడి ఆరోప‌ణ‌లు నిరాధారం.. ఖండించిన న‌టి
X

వెంకట్ ప్రభు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్)'లో విజయ్‌తో కలిసి నటించిన నటుడు పార్వతి నాయర్, సుభాష్ చంద్రబోస్ అనే కార్మికుడిపై దాడి చేసి నిర్బంధించారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. సెప్టెంబర్ 5న విడుదలైన ది గోట్ చిత్రంలో పార్వ‌తి సహాయక పాత్రలో నటించింది. సుభాష్ ఫిర్యాదు మేరకు పార్వ‌తి నాయిర్‌తో పాటు మరో ఐదుగురిపైనా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు కాపీ ప్రకారం KJR స్టూడియోస్‌లో హెల్పర్‌గా పనిచేసిన సుభాష్‌ను 2022లో పార్వతి త‌న‌ నివాసంలో ఇంటి పని చేయమని అడిగారు.

ఆ సమయంలో పార్వతి ఇంటి నుండి ల్యాప్‌టాప్, వాచ్, కెమెరా, మొబైల్ ఫోన్‌ సహా అనేక వస్తువులు మాయమయ్యాయి. ఆ తర్వాత నటుడు సుభాష్‌పై అనుమానాస్పద దొంగతనం ఆరోపణలతో పార్వతి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే సుభాష్ ఇప్పుడు తన వైపు కథను మీడియాకు వివ‌రించారు. 'ది గోట్' విడుదలైన తర్వాత తాను కెజెఆర్ స్టూడియోలో పనికి తిరిగి వచ్చినప్పుడు పార్వతి స్టూడియోకి వచ్చి త‌న‌ను చెంపదెబ్బ కొట్టిందని, మిగిలిన ఐదుగురు తనపై మాటలతో దూషించారని సుభాష్ ఆరోపించారు. అతడు చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సైదాపేట 19వ ఎంఎం కోర్టును ఆశ్రయించారు.

అయితే నటి పార్వతి నాయర్ దాడి ఆరోపణలు నిరాధారం అని పేర్కొన్నారు. కొన్ని తప్పుడు కథనాలు, నిరాధార ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. త్వరలో నిజం బయటపడుతుంది! అని నాయర్ తన ప్రకటనలో రాశారు. పార్వ‌తి తన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల తిరుగులేని మద్దతు ఇచ్చిన‌వారంద‌రికీ కృతజ్ఞతలు తెలిపారు.

KGR స్టూడియోలో నాయర్ తనను చెప్పుతో కొట్టింద‌ని బోస్ ఫిర్యాదులో ఆరోపించాడు. నాయర్‌తో పాటు అయాలాన్ నిర్మాత రాజేష్ .. మరో ఐదుగురు కూడా బోస్‌ను ఒక గదిలో బంధించారని.. తప్పుడు దొంగతనం ఆరోపణలపై వేధించారని ఆరోపించారు. బోస్ నిజానికి దొంగతనం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత కేజీఆర్ స్టూడియోలో పని చేయడం ప్రారంభించాడు. ఆ స‌మ‌యంలో వ‌రుస‌ ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించారు. తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. సైదాపేట మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత, నాయర్ ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్‌లు 296(బి), 115(2), మరియు 351(2) కింద ఆమెపై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.