మ్యాకప్ తో పవిత్ర..చిక్కుల్లో లేడీ ఎస్ఐ!
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రాగౌడ్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో ఉంచారు
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రాగౌడ్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైలులో ఉంచారు. అయితే పవిత్ర మ్యాకప్ కి సహకరించిన, అనుమతించిన మహిళా ఎస్ఐ నేత్రావతికి తాజాగా పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో నేత్రావతికి నోటీసులు వెళ్లాయి. పోలీసుల అదుపులో ఉండగా పవిత్ర గౌడ మేకప్ వేసుకుంది.
ఇది చట్టరీత్యా నేరమా? అన్నది తేలాలి. దీనికి తోడు కేసు విచారణ సమయంలో రాజేశ్వరి నగర్ లోని ఇంటికెళ్లి మ్యాకప్ వేసుకుని బయటకు వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది సోషల్ మీడియా లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులపైనా తీవ్ర విమర్శలొచ్చాయి. అభియోగం ఎదుర్కోంటున్న నిందుతురాలి పట్ల ఇంత నిర్లాక్ష్యంగా పోలీసులు వ్యవరిస్తారా? అని నెటి జనులు తీవ్ర విమర్శలు చేసారు.
దీంతో బెంగళూరు సిటీలోని విజయనగరం పోలీస్స్టేషన్ లేడీ ఎస్ఐ నేత్రావతికి డీసీపీ రూల్ 7 కింద నోటీసులు జారీ అయ్యాయి. పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడను జూన్ 15వ తేదీన ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లారు. ఆ సమయంలో నటి పవిత్ర గౌడను ఆమె ఇంటికి ఎస్ఐ నేత్రావతిని తీసుకెళ్లారు. కస్టడీలో ఉన్న పవిత్ర ఇంటికి ఎప్పటిలాగే వెళ్లిందని, కానీ తిరిగతి వచ్చే సమయంలో ముఖానికి పుల్ గా మ్యాకప్ , పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని బయటకు వచ్చింది.
దీనంతటికి ఎస్ఐ నేత్రావతి కారణం కావడంతో అధికారులు ఆమెని ప్రశ్నించాలని నోటీసులిచ్చారు. దీంతో వీరిద్దరికీ ముందు నుంచి పరిచయం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నటుడు దర్శన్ తో పాటు మరికొంత మంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీళ్లంతా కూడా అగ్రహారం జైలులోనే ఉన్నారు.