ల‌క్ష పుస్త‌కాల సీక్రెట్ చెప్పేసిన ప‌వ‌ర్ స్టార్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పుస్త‌కాలంటే ఎంత ఆస‌క్తి అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాళీ స‌మ‌యం ఉంటే ఆ స‌మ‌యాన్ని పుస్త‌కాల‌తోనే గడుపుతారు.

Update: 2025-01-03 06:09 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పుస్త‌కాలంటే ఎంత ఆస‌క్తి అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాళీ స‌మ‌యం ఉంటే ఆ స‌మ‌యాన్ని పుస్త‌కాల‌తోనే గడుపుతారు. ఇంట్లో స‌మ‌యం ఉన్నా? ఆన్ సెట్స్ లో స‌మ‌యం దొరికినా? ఆయ‌న పుస్త‌కాల ద్వారా నాలెడ్జ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం మొద‌లైన త‌ర్వాత పుస్త‌కాలకు మ‌రింత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. తాను పెద్ద పెద్ద చ‌దువులు చ‌దువుకోక‌పోయినా? చేతిలో డిగ్రీలు లేక‌పోయినా? పుస్త‌కాల ద్వారా ఎంతో ప‌రిజ్ఞానాన్ని సంపాదించారు.

అప్ప‌ట్లో ఆయ‌న ల‌క్ష పుస్త‌కాల వ్యాఖ్య ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ల‌క్ష పుస్త‌కాలు చ‌ద‌వ‌డం ఎలా సాధ్య‌మైంది అంటూ ఎన్నో విమ‌ర్శ‌లు సైతం ఎదుర్కున్నారు. తాజాగా ఆ పుస్త‌కాల వెనుక అస‌లు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌లో జరిగిన 35వ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవం లో ప‌వ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పుస్త‌కాలు జీవితానికి ఎంత ముఖ్యం అన్న‌ది చెప్పే ప్ర‌య‌త్నం చేసారు.

త‌న జీవితంలో పుస్త‌కాలు ఎలాంటి కీల‌క పాత్ర పోషించాయో చెప్ప‌క‌నే చెప్పారు. ఈ సంద‌ర్భంగానే ఒక్క సారిగా పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు. `నాకు పాకెట్ మని మా వదిన ఇచ్చేది. ఆ డబ్బుతో పుస్తకాలు కొందాం అని వెళ్తే అవి సరిపోయేవి కాదు. నా `తొలిప్రేమ` సినిమా రెమ్యునరేషన్ 15 లక్షలు వచ్చాయి. అప్పుడే 1 లక్ష పెట్టి పుస్తకాలు కొనుక్కున్నాను. పుస్త‌కాలంటే అంత ఇష్టం` అన్నారు. `పుస్తకాలు ఎప్పుడూ నాకు విలువైన వస్తువులు. అందుకే పుస్త‌కాల కోసం డబ్బు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసేవాడినన్నారు. త‌ల్లిదండ్రుల వ‌ల్ల పుస్త‌క ప‌ఠ‌నం అల‌వాటైంది.

కోటి ఇవ్వ‌డానికి ఆలోచించ‌ను. కానీ ఒక పుస్త‌కం ఇవ్వ‌డానికి మాత్రం ఆలోచిస్తాను. పుస్తకాలు ఇవ్వ‌డం అంటే నా సంప‌ద ఇచ్చిన‌ట్లు మ‌ధ‌న‌ప‌డ‌తా. పుస్త‌కాలు కావాల‌ని ఎవ‌రైనా అడిగితే కొనిస్తాను. కానీ నా ద‌గ్గ‌రు ఉన్న‌వి మాత్రం ఇవ్వ‌ను. పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు లేక‌పోతే జీవితంలో ఏమ‌య్యేవాడినో అనిపిస్తుంది. ఇంట‌ర్ తోనే చ‌దువు ఆపేసినా పుస్త‌కాలు చ‌ద‌వ‌డం మాత్రం ఆప‌లేదు. నేనే కోరుకున్న చ‌దువు పుస్త‌కాల్లో లేదు. క్లాస్ రూమ్ ల్లో లేదు. ర‌వీంద్ర నాధ్ ఠాగూర్ స్కూల్ కి వెళ్ల‌కుండా ఇంటి వ‌ద్ద‌నే నేర్చుకున్నార‌ని విన్నాను. ఆయ‌న ప్రేర‌ణ‌తోనే అదే బాట‌లో వెళ్లాల‌నుకుంటున్నా` అన్నారు.

Tags:    

Similar News