పవర్ స్టార్‌ కూతురు ఆటో జర్నీ ఎక్కడో తెలుసా!

తాజాగా పవన్‌ కళ్యాణ్ కూతురు ఆద్య సింప్లిసిటీ గురించిన చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ తాజాగా ఆద్య ఆటోలో ప్రయాణిస్తున్న వీడియోను షేర్‌ చేసింది.

Update: 2024-12-29 06:04 GMT

టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సింప్లిసిటీకి మారు పేరు అంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. నటుడిగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించినా, అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నా సింప్లిసిటీ విషయంలో ఆయనను చూసి చాలామంది నేర్చుకోవాలి. ఒక పెద్ద స్టార్‌ మాదిరిగా కాకుండా ఒక సాదారణ వ్యక్తిగానే ఆయన జీవనం సాగుతుంది. ఆయన ప్రతి విషయంలోనూ సింప్లిసిటీతోనే ఉంటారు. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్ సింప్లిసిటీ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయమై చర్చ జరుగుతూనే ఉంటుంది.

తాజాగా పవన్‌ కళ్యాణ్ కూతురు ఆద్య సింప్లిసిటీ గురించిన చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ తాజాగా ఆద్య ఆటోలో ప్రయాణిస్తున్న వీడియోను షేర్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ కూతురు అయ్యి ఉండి ఆద్య ఆటోలో ప్రయాణించడం ఏంటి అంటూ చాలా మంది ఆశ్చర్య వ్యక్తం చేశారు. అయితే ఆమె హైదరాబాద్‌లో ఆటోలో ప్రయాణించలేదు. కాశికి వెళ్లిన సమయంలో ఆద్య తన తల్లి రేణు దేశాయ్‌తో కలిసి ఆటోలో ప్రయాణించింది. అక్కడ అయినా ఆద్య, రేణు దేశాయ్‌లు కోరుకుంటే కారులో ప్రయాణించవచ్చు. తండ్రి పేరు చెప్పి అక్కడ అధికారికంగా పర్యటన సాగించొచ్చు. కానీ ఆద్య అలా చేయకుండా సింపుల్‌గా ఆటోలో ప్రయాణించింది.

సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్‌ షేర్‌ చేసిన ఆ వీడియోను చాలా మంది షేర్‌ చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి బుద్దులు వచ్చాయి, తండ్రి పోలికలు వచ్చాయి అంటూ చాలా మంది ఆద్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతోనూ తెగ హడావిడి చేస్తూ ఉంటారు. తాము పెద్ద సెలబ్రెటీలం అన్నట్లుగా సమాజంలో ఆడంబరాలను ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఆద్య అలా కాకుండా సింప్లీ సూపర్‌ అన్నట్లుగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మధ్య అకీరా సైతం ప్రధాన నరేంద్ర మోడీని కలిసి సమయంలోనూ సింపుల్‌ అండ్‌ మ్యాన్లీ లుక్‌ లో కనిపించి వైరల్‌ అయిన విషయం తెల్సిందే.

పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్ విడిపోయినా అకిరా, ఆద్యలు రెండు చోట్ల ఉంటూ తల్లిదండ్రుల ప్రేమను పొందుతున్నారు. సాధారణంగా విడిపోయిన తల్లిదండ్రుల పిల్లలు ఇబ్బంది పడతారు. కానీ ఆద్య, అకీరాకు అటు తల్లి, ఇటు తండ్రి ప్రేమ దక్కుతుంది. పవన్‌ ముఖ్య సందర్భాల్లో కచ్చితంగా అకీరా, ఆద్యలను తీసుకు వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. ఇటీవల తిరుపతి వెళ్లిన సమయంలో ఆద్యను పవన్‌ తీసుకు వెళ్లడం మనం చూశాం. అకీరా, ఆద్యలు చాలా లక్కీ అంటూ చాలా మంది అంటూ ఉంటారు. ప్రస్తుతం అకీరా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News