పవర్ స్టార్ సీన్ లోకి దిగితే వీరమల్లు ముగింపే!
అలా జరగాలంటే పవన్ కళ్యాణ్ ఆ షెడ్యూల్ కి హాజరవ్వాలి. కొత్త షెడ్యూల్ కోసం పవన్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా నిరవధికంగా హాజరైతే షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కొన్ని షెడ్యూళ్ల షూటింగ్ కి హాజరవ్వడంతో? ముగింపు దశకు చేరుకుంది. అప్పటి నుంచి షూటింగ్ బ్రేక్ ఇవ్వకుండా చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో పవన్ మినహా కీలక పాత్రధారులంతా పాల్గొంటు న్నారు.
అయితే తర్వాత మొదలయ్యే షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. అలా జరగాలంటే పవన్ కళ్యాణ్ ఆ షెడ్యూల్ కి హాజరవ్వాలి. కొత్త షెడ్యూల్ కోసం పవన్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా నిరవధికంగా హాజరైతే షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అంటే వీరమల్లు టీమ్ ఇక గుమ్మడికాయ కొట్టడానికి ఇంకెన్నో రోజులు లేదని తెలుస్తోంది. మరోవైపు షూటింగ్ పూర్తియిన వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
మార్చి 28 రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టు యూని గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం డిలే చేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేస్తుంది. పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ప్రకారం డేట్లు ఇవ్వకపోవడంతో ఈ డిలే జరిగింది . లేదంటే ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యేది. ఏది ఏమైనా వచ్చే ఏడాది మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేయడం ఖాయం. ఈ సినిమా షూట్ పూర్తిచేసిన వెంటనే పవన్ 'ఓజీ' చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కించనున్నారు.
ఆ సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ హాజరవ్వకే డిలే అవుతుంది. ఇప్పటికే ఓజీ షూట్ కూడా ముగింపు చేరుకుంది. పవన్ పై పెండింగ్ సన్నివేశాలు పూర్తి చేస్తే ప్రధాన ఘట్టం ముగిసినట్లే. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. మరోవైపు పపన్ పూర్తి చేయాల్సిన మరో ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ రాక కోసం దర్శకుడు హరీష్ శంకర్ కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు.