ఫిష్ వెంకట్ కి పవన్ కళ్యాణ్ సహాయం!
రెండు లక్షల రూపాయలు సహాయం అందించారు. తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
కమెడియన్ ఫిష్ వెంకట్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు వచ్చినా వెళ్లలేని పరిస్థితులు. శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు. దీనికి తోడు ఆర్దిక సమస్యలు చుట్టుముట్టాయి. సహాయం అంటూ ఇప్పటికే ఆయన చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహాయం అందించారు.
రెండు లక్షల రూపాయలు సహాయం అందించారు. తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు. కష్టకాలంలో ఆదుకున్న పవన్ కల్యాణ్, ఆయన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని వెంకట్ కోరుకున్నారు. ఈ వీడియోను పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఫిష్ వెంకట్ కొంత కాలంగా డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి.
కమెడియన్ గా, ఫైటర్ గా ఫిష్ వెంకట్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ విలన్ అంటే ఫిష్ వెంకట్ ఉండాల్సిందే. నటుడిగా అంత ఫేమస్ అయ్యాడు. తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఫిష్ వెంకట్ కనిపిస్తే ప్రేక్షకుల నోట నవ్వు తన్నుకొచ్చేది.
అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్ తో తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్న నటుడాయన. 'ఆది' సినిమాతో ఫిష్ వెంకట్ కెరీర్ ప్రారంభంమైంది. అటుపై చాలా సినిమాల్లో నటించాడు. 2023 లో 'లింగొచ్చా' అనే సినిమాలోనూ నటించాడు. మళ్లీ ఆ తర్వాత అనారోగ్యం కారణంగా తెరపై కనిపించలేదు.