పవన్ తో మరొకటి సాధ్యమేనా?

ఇప్పుడు ఈ తరుణంలో మరో మాస్ యాక్షన్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని పవన్‌తో సినిమాకి సిద్ధమవుతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.;

Update: 2025-04-15 15:30 GMT
పవన్ తో మరొకటి సాధ్యమేనా?

డిప్యూటీ సీఎం అయ్యాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జీవితంలో మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లో పూర్తిగా బిజీగా మారిన పవన్.. సినిమాలకు సమయం కేటాయించడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇప్పటికే కొన్నేళ్లుగా షూటింగ్‌లో దశలోనే ఉన్న 'హరి హర వీర మల్లు' వంటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇంకా పూర్తికావడం లేదు. మే 9న విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించినా.. ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు.

ఇదిలా ఉండగా.. పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడటం వల్ల సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయింది. ప్రస్తుతం OG అనే భారీ యాక్షన్ డ్రామా కూడా పవన్ లైనప్‌లో ఉంది. కానీ OG కు ఇప్పటివరకు పవన్ డేట్స్ ఖచ్చితంగా ఫిక్స్ కాలేదు. మరోవైపు, హరిష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా కూడా పవన్ లిస్టులో ఉంది. ఇది తమిళ సూపర్ హిట్ 'తెరి'కి ప్రేరణగా తెరకెక్కుతోంది.

ఇప్పుడు ఈ తరుణంలో మరో మాస్ యాక్షన్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని పవన్‌తో సినిమాకి సిద్ధమవుతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఒక పక్క పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నా.. గోపిచంద్ మాత్రం 2026లో పవన్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇది ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందట. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే తొలిదశ చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది.

గోపిచంద్ మలినేని ఇప్పటికే రవితేజ, బాలకృష్ణ వంటి మాస్ స్టార్స్‌తో భారీ హిట్లు కొట్టారు. రీసెంట్ గా సన్నీ డియోల్ తో చేసిన జాట్ సినిమా కూడా కమర్షియల్ గా కలెక్షన్స్ బాగానే అందుకుంటోంది. ఇప్పుడు గోపిచంద్, పవన్‌తో కలిసి ఒక మాస్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ పవన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసినట్లయితే.. కొత్త ప్రాజెక్ట్ చేయడం సాధ్యమా అనే డౌట్ అభిమానుల్లో మొదలైంది.

OG, భగత్ సింగ్, వీర మల్లులాంటి సినిమాలే పూర్తి కావాల్సిన ఈ టైంలో మరో ప్రాజెక్ట్ అనేది కాస్త క్లిష్టంగా ఉంది. అభిమానులు మాత్రం ఈ మాస్ డైరెక్టర్ పవన్‌తో సినిమా చేస్తే ఫైర్ అండ్ ఫ్యూయల్ కాంబినేషన్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ ప్రయోగం 2026లో స్టార్ట్ అవుతుందా లేక పూర్తిగా గాసిప్‌గానే ముగుస్తుందా? అన్నది చూడాలి.

Tags:    

Similar News