ప‌వ‌న్ పై నెగిటివీటీ దెబ్బ‌కు ఠా!

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ ప్ర‌యాణం మొద‌లైన నాటి నుంచి సినిమా షూటింగ్ లకు స‌రిగ్గా హాజ‌రు కావ‌డం లేద‌నే విమ‌ర్శ చాలా కాలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-12-31 09:40 GMT

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ ప్ర‌యాణం మొద‌లైన నాటి నుంచి సినిమా షూటింగ్ లకు స‌రిగ్గా హాజ‌రు కావ‌డం లేద‌నే విమ‌ర్శ చాలా కాలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌నకు ఖాళీ ఉంటే వెళ్ల‌డం లేక‌పోతే లేదు అన్న‌ట్లు గా స‌న్నివే శం క‌నిపించింది. ప‌వ‌న్ కోసం ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు వేచి చూసి విసిగిపోతున్నార‌ని, ఆయ‌న ప్లానింగ్ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతుంద‌నే విమ‌ర్శ‌లు సైతం ఎదుర్కున్నారు. ముఖ్యంగా `ఓజీ`, `హ‌రి హ‌రి వీర‌మ‌ల్లు` సినిమా షూటింగ్ జాప్యానాకి కార‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గానే మీడియాలో హైలైట్ అయింది.

ఎన్నిక‌ల‌కు ముందు పొలిటిక‌ల్ ప్ర‌చారం...గెలిచిన త‌ర్వాత ప‌ద‌వితోనూ బిజీగా ఉన్నార‌ని.. సినిమాలు ప‌ట్టించు కోవడం లేద‌ని..ఆయ‌న కార‌ణంగా సినిమాలు రిలీజ్ లు అవ్వ‌డం లేద‌ని...అభిమానులు ఏదైనా అడ‌గాలంటే నేరుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నే సూటిగా అడ‌గాలంటూ మీడియాలో పుంకాలు పుంకాలుగా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అయితే అస‌లు సంగ‌తి ఏంటి? అన్న‌ది ఇటీవ‌లే బయ‌ట ప‌డింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ డేట్లు ఇచ్చినా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆ డేట్ల‌లో త‌న‌ని వాడుకోక‌పోవ‌డం వ‌ల్ల షూటింగ్ లు పూర్తి కాన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో విష‌యం క్లియ‌ర్ గా అర్ద‌మైపోతుంది. ఇది ప‌వ‌న్ త‌ప్పు కాదు. ద‌ర్శ‌క నిర్మాత‌ల త‌ప్పు అని. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకి డేట్లు ఇవ్వ‌డ‌మే? మ‌హాభాగ్యంగా భావిస్తారు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు. ఆయ‌న పోర్ష‌న్ ఎంత వీలైంత అంత తొంద‌ర‌గా పూర్తిచేసి పంపిచాల‌ని చూస్తారు. కానీ ఓజీ, వీర‌మ‌ల్లు సినిమా విష‌యంలో అదే ఏస్టేజ్ లోనూ జ‌ర‌గ‌లేద‌ని తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

ప‌వ‌న్ రెడీగా ఉన్నా? ప‌వ‌న్ డేట్లు ఇచ్చిన స‌మ‌యంలో ఆ రెండు చిత్ర యూనిట్ లు సిద్దంగా లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని తేలిపోయింది. అలాగే హ‌రీష్ శంక‌ర్ సినిమాకు కూడా డేట్లు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టికీ ఆయ‌న కూడా సిద్దంగా లేక‌పోవ‌డంతోనే ఆప్రాజెక్ట్ కూడా డిలే అయింద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ఇటీవ‌ల వ్య‌క్తం చేసిన అస‌హ‌నం నేప‌థ్యంలో నిర్మాత‌లు ఆయ‌న్ని ఇబ్బంది పెట్టొద్దంటూ అభిమానుల గొంతు నొక్కే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌త తెలిసిందే. దీంతో ప‌వ‌న్ డేట్లు స‌వ్యంగా ఇవ్వ‌రు! అన్న అప‌వాద ఆయ‌న పై తాజా క్లారిటీతో తొలిగిపోయిన‌ట్లే.

Tags:    

Similar News