ప‌వ‌న్ సార్ దిగాల్సిందే..లేక‌పోతే ప‌న‌వ్వ‌దా!

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిందంతా ఒక ఎత్తు..ఇక‌పై జ‌రిగేది మ‌రో ఎత్తు అంటూ కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈసినిమాకి ఇంకా ప‌వ‌న్ ఐదు రోజులు డేట్లు కేటాయించాలి.;

Update: 2025-04-07 04:48 GMT
ప‌వ‌న్ సార్ దిగాల్సిందే..లేక‌పోతే ప‌న‌వ్వ‌దా!

`హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` రిలీజ్ ఇప్పటికే ఆల‌స్య‌మైంది. ప‌లుమార్లు రిలీజ్ తేదీలు ఇచ్చి వెన‌క్కి తీసుకున్నారు. కానీ మే 9 మాత్రం రిలీజ్ ప‌క్కా అంటున్నారు. ఈసారి వెన‌క్కి తీసుకునేదే లేదంటున్నారు. అభిమానులు కూడా ఈసారి బ‌లంగానే న‌మ్ముతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిందంతా ఒక ఎత్తు..ఇక‌పై జ‌రిగేది మ‌రో ఎత్తు అంటూ కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈసినిమాకి ఇంకా ప‌వ‌న్ ఐదు రోజులు డేట్లు కేటాయించాలి.

ఆ డేట్లు ఇస్తే అత‌డిపై పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తారు. వాస్త‌వానికి ఏప్రిల్ 4 నుంచే డేట్లు ఇస్తున్నార‌ని వెలుగులోకి వ‌చ్చింది. కానీ ప‌వ‌న్ పొలిటిక‌ల్ బిజీ నేప‌త్యంలో వీలు ప‌డ‌లేదు. అయితే ఇక‌పై మాత్రం ప‌వ‌న్ ఇలా స్కిప్ కొట్ట‌డ‌నికి ఛాన్స్ లేదు. మే 9న రిలీజ్ చేయాలంటే పీకే ఉన్న ప‌ళంగా డేట్లు ఇచ్చి తీరాలి. లేక‌పోతే రిలీజ్ మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంద‌ని అనే సంకేతాలు జ‌నాల్లోకి వెళ్లిపోతున్నాయి.

అలాగే ఈ సినిమా ప‌వ‌న్ తొలి పాన్ ఇండియా సినిమా. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార ప‌నుల్లోనూ ప‌వ‌న్ త‌ప్ప‌క పాల్గొనాల్సిందే. పాన్ ఇండియా సినిమా అంటే ఎక్కువ‌గా నార్త్ లో ప్ర‌మోట్ చేయాలి. పైగా ఈ క‌థ కూడా హిందుత్వాన్ని బ‌లంగానే చెబుతుంది. ఈ నేప‌థ్యంలో క‌ళ్యాణ్ ఉత్త‌రాది రాష్ట్రాల ప్ర‌చారంలో కూడా పాల్గొనాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డుతుంది. దీనిలో భాగంగా మేక‌ర్స్ కూడా ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అభ్య‌ర్దించాల‌ని చూస్తున్నారట‌.

నిజానికి ప‌వ‌న్ లేకుండా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు హీరోయిన్ ని వెంట తిప్పుకుని ఎంత ప్ర‌చారం చేసినా ఆ సినిమా జ‌నాల్లోకి వెళ్ల‌డం క‌ష్టం. హీరో ఒక్క ఈవెంట్ కి హాజ‌రైనా ఆ సినిమాకి కోట్లు రూపాయ‌ల ప‌బ్లిసిటీ వ‌స్తుంది. జ‌నాల్లోకి సుల‌భంగా వెళ్లిపోతుంది. బాలీవుడ్ లో ప్ర‌చారం అంటే మీడియా ముందుకెళ్తేనే స‌రిపోదు. అక్క‌డ టీవీ షోల్లో కూడా పాల్గొనాలి. అంత స‌మ‌యం ప‌వ‌న్ కి లేక‌పోయినా? క‌నీసం మీడియా మీట్ లోనైనా ఉండేలా మేక‌ర్స్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారట‌. ఇక ఏపీలో ఎలాగూ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తారు. అప్పుడెలాగు ప‌వ‌న్ త‌ప్ప‌క హాజ‌ర‌వుతారు.

Tags:    

Similar News