పవన్ కళ్యాణ్ సినిమాలు.. ఎవరి ప్లాన్స్ లో వాళ్ళున్నారు..

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరల సినిమా షూటింగ్స్ కి సిద్ధం అవుతున్నారు.

Update: 2024-09-09 05:33 GMT

ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరల సినిమా షూటింగ్స్ కి సిద్ధం అవుతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం కారణంగా చాలా కాలం నుంచి షూటింగ్స్ హోల్డ్ లో పడిపోయాయి. పవన్ కళ్యాణ్ చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా బ్యాక్ టూ బ్యాక్ పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎట్టకేలకు పెండింగ్ సినిమాల షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవర్ స్టార్ నుంచి సిగ్నల్ రావడంతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఇప్పటికే బిజీ అయ్యారు. విజయవాడలోనే పవన్ కళ్యాణ్ కోసం గ్రీన్ మ్యాట్ స్టూడియోని సిద్ధం చేసారంట. అన్ని ఏర్పాట్లు జరిగిపోవడంతో సెప్టెంబర్ 22 నుంచి షూటింగ్ లో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ నిర్మాతకి చెప్పారంట. దీంతో పవన్ కళ్యాణ్ కి సంబందించిన సన్నివేశాలు చిత్రీకరణకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

హరిహరవీరమల్లు సినిమా క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయ్యింది. అయితే పలు కారణాల వలన క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీంతో హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ కి దర్శకత్వ బాధ్యతలని జ్యోతికృష్ణ చేపట్టారు. ఈయన సారధ్యంలో మిగిలిన పార్ట్ మొత్తం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓజీ సినిమా షూటింగ్ కోసం కూడా సుజిత్ విశాఖపట్నంలో ఏర్పాట్లు చేశారంట. అక్టోబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారంట.

బ్యాక్ టూ బ్యాక్ ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలవుతుందని నిర్మాత కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హరీష్ శంకర్ కూడా ఈ సినిమా షూటింగ్ ఎక్కడ రీ స్టార్ట్ చేయాలనేది ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావడానికి వీలుగా ఉండేలా ఏపీలోనే లోకేష్ సెట్ చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఒకవేళ ఈ మూడు సినిమాలు షూటింగ్ ఈ ఏడాదిలోనే కంప్లీట్ అయిపోతే 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ముందుగా ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమా సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News