ఉస్తాద్ భగత్ సింగ్.. క్లారిటీతో పాటు ఓ సర్ ప్రైజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండవ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండవ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. వీరి కలయికలో మొదట వచ్చిన గబ్బర్ సింగ్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఉస్తాద్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో చాలా రోజులుగా కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది.
అసలు ఇప్పట్లో పవన్ ఆ సినిమా షూటింగ్ మొదలుపెడతాడా? లేదంటే ముందుగా మిగతా సినిమా షూటింగ్స్ పూర్తి చేస్తాడా? అనే ప్రశ్నలు ఎన్నో వచ్చాయి. టాక్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో OG సినిమాను ఫినిష్ చేస్తాడు అని ఒక క్లారిటీ వచ్చింది. దానికి తోడు హరిహర వీరమల్లు కూడా లైన్లో ఉంది. కాబట్టి దాన్ని కూడా ముందుగానే ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.
దీంతో భగత్ సింగ్ సినిమా పూర్తి కావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మైత్రి మూవీ వ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఆ ప్రాజెక్టు పై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఇంకా ఏమన్నారంటే.. 'త్వరలోనే అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ మొత్తం కూడా ఈ ఏడాదికి డిసెంబర్ లో, లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతి లోపు ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కచ్చితంగా ఏదో అప్డేట్ అయితే ఇస్తాము. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక షూట్ చేసింది కొంత భాగమే అయినప్పటికీ కూడా ఏదో ఒక స్పెషల్ అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా ఉంటుంది" అని ఆయన ఒక సర్ ప్రైజ్ అయితే ఇచ్చారు.
దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండనున్నట్లు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్.. ఒక వైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను కొనసాగిస్తూనే గ్యాప్ ఉన్నప్పుడు షూటింగ్స్ కూడా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఆయన రెండు పడవల ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.