వీరమల్లుకు లైన్ క్లియర్ అయినట్టే
దానికి కారణం వీరమల్లు ఆఖరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు జరగనుంది.;

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మూడు సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. వాటిలో అన్నింటికంటే ముందుగా కమిట్ అయిన సినిమా హరిహర వీరమల్లు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజి సినిమాలకు డేట్స్ ఇచ్చాడు. మొత్తానికి మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లి వరుస పెట్టి సినిమాలు చేసేద్దాం అనుకున్నాడు కానీ ఏపీ రాజకీయ పరిస్థితులు పవన్ షెడ్యూల్ మొత్తాన్ని మార్చేశాయి.
ఒక్కసారిగా పవన్ రాజకీయాల్లో బిజీ అవడం, తర్వాత ఎలక్షన్స్ రావడం, పవన్ హిస్టారికల్ విక్టరీ ఆయన్ను చాలా బిజీగా మార్చాయి. దీంతో పవన్ అనుకున్న వెంటనే సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఎలాగోలా వీలు చూసుకుని ఒక్కో సినిమాను పూర్తి చేయాలని డిసైడ్ అయిన పవన్ తిరిగి షూటింగ్స్ పూర్తి చేస్తూ వస్తున్నాడు. అయితే పవన్ చేస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ముందు రిలీజయ్యే సినిమా హరిహర వీరమల్లునే.
అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు చూసినా ఓజి సినిమా జపం చేస్తూ వీరమల్లుని లైట్ తీసుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఎప్పుడో మొదలైన సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ కు వీరమల్లు పై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దానికి తోడు ఇప్పటికే ఆ సినిమా పలుమార్లు వాయిదా పడింది. దీంతో మళ్లీ కూడా వాయిదా పడుతుందనుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.
కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీరమల్లును మే 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈసారైనా చిత్ర యూనిట్ చెప్పిన మాట మీద ఉంటారా అనే డౌట్స్ ఆడియన్స్ లో ఉన్నప్పటికీ ఈసారి చిత్ర యూనిట్ మాట నిలబెట్టుకునేలానే కనిపిస్తుంది. దానికి కారణం వీరమల్లు ఆఖరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు జరగనుంది. ఈ వారంలో పవన్ డేట్స్ కేవలం 4 రోజులేనట. అంటే పవన్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తైనట్టే.
ఆల్రెడీ షూట్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసిన జ్యోతి కృష్ణ క్రిష్ డైరెక్ట్ చేసిన ఫుటేజ్ తో కలిపి ఫైనల్ కాపీని రెడీ చేయిస్తున్నాడట. పలు విదేశీ కంపెనీలు కూడా ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో హరిహర వీరమల్లు రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్టే. ఫస్ట్ కాపీని రెడీ చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్ కు సెన్సార్ ను పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి పవన్ ఫ్యాన్స్ వీరమల్లు రిలీజ్ కు రెడీ అయిపోవచ్చు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.