పవన్ సినిమా రిలీజుల ఆర్డర్ మారుతోందా?
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ముందుగా పీకే నుంచి రిలీజ్ అయ్యేది ఆ సినిమాగానే బలమైన ప్రచారం సాగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు'..'ఓజీ' చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. అటు `ఓజీ` పవన్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది. రెండు సినిమాల షూటింగ్ లు దాదాపు క్లైమాక్స్ లోనే ఉన్నాయి. అయితే వీరమల్లు బాగా డిలే అవ్వ డంతో పీకే ఆ సినిమాకి డేట్లు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ముందుగా పీకే నుంచి రిలీజ్ అయ్యేది ఆ సినిమాగానే బలమైన ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే మార్చి 25 రిలీజ్ అంటూ తేదీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడీ సినిమా రిలీజ్ వాయిదా పడుతున్నట్లు సమాచారం. వీరమల్లు కంటే ఓజీనే ముందుగా రిలీజ్ అవుతుందని కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. వీరమల్లు తేదీకి ఓజీ రిలీజ్ అవుతుందని.... ఆ తర్వాతే వీరమల్లు రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి ముందు ఓజీ రిలీజ్ అవుతుందా? వీరమల్లు రిలీజ్ అవుతుందా? అన్నది క్లారిటీ ఇవ్వాల్సింది దర్శక-నిర్మాతలు.
వాస్తవానికి ముందుగా షూటింగ్ ప్రారంభమైంది హరిహర వీరమల్లు. ఆ తర్వాత అనూహ్యంగా సుజిత్ తో ఓజీ ప్రాజెక్ట్ ప్రకటించడం..వెంటనే మొదలు పెట్టడం...షూటింగ్ ప్రారంభించడం అంతా వేగంగా జరిగిపోయింది. పవన్ చూపించిన వేగం చూసి ముందుగా రిలీజ్ అయ్యేది ఓజీ అని తేలిపోయింది. అందుకు తగ్గట్టు సెప్టెంబర్ లో రిలీజ్ అంటూ ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఆ ఆతర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
పవన్ `ఓజీ` పెండింగ్ షూటింగ్ కి డేట్లు ఇవ్వకపోవడంతో? మొత్తం సీన్ మారిపోయింది. ఆ తర్వాత ఏపీలో వర్షాలు.. .రాజకీయం కాక నేపథ్యంలో? అసలు పవన్ ఈ ఏడాది ఏ సినిమా షూటింగ్ కైనా హాజరవుతాడా? అన్న సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముందుగానే ఓజీనే పూర్తి చేస్తాడు అనుకుంటూ అనూహ్యంగా వీరలమల్లుని లైన్ లోకి తెచ్చారు. విజయవాడలో సెట్లు వేసుకోమని సూచించడంతో? వీరమల్లు టీం పవన్ ఆదేశాల మేరకు అక్కడ సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. దీంతో వీరమల్లు మార్చి రిలీజ్ కన్పమ్ అనుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు ముందు వెనుకవుతుందనే వార్త వైరల్ అవుతుంది.