OG.. పీక్స్ లో ఆ సీన్స్..?
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఓజీ సినిమా.. ఫస్ట్ గ్లింప్స్ తోనే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన సినిమా ఇది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య డివివి నిర్మిస్తున్నారు. RRR సినిమా తర్వాత దానయ్య నిర్మిస్తున్న ఈ ఓజీ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఓజీ సినిమా.. ఫస్ట్ గ్లింప్స్ తోనే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన సినిమా ఇది. ఐతే ఈ సినిమా దాదాపు రెండేళ్లుగా సెట్స్ మీద ఉంది. సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే రిలీజ్ అనుకున్నారు కానీ రిలీజ్ కాలేదు.
ఓజీ సినిమా విషయంలో వాళ్లకు కావాల్సిన డేట్స్ ఇచ్చినా కూడా షూటింగ్ పూర్తి కాలేదని పవన్ ఒక సందర్భంలో అన్నారు. ఐతే లేట్ అయినా సరే ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా సినిమా ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా సుజిత్ పవర్ స్టార్ ఎలివేషన్స్, స్టైలిష్ సీన్స్ మీద ఎక్కువ ఫోక చేశాడని టాక్. స్వతహాగా పవర్ స్టార్ ఫ్యాన్ అయిన సుజిత్ ఆయన్ను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.
రన్ రాజా రన్, సాహో రెండు సినిమాల అనుభవం ఉన్న సుజిత్ పవర్ స్టార్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఐతే ఓజీ సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో తను మొదట రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే శాంపిల్ చూపించాడు సుజిత్. ముఖ్యంగా థమన్ మ్యూజిక్ ఐతే వీరె లెవెల్ లో ఉంది. ఓజీ లో తెర మీద పవర్ స్టార్ విధ్వంసానికి డైరెక్టర్ గా సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ తెర వెనుక అదరగొట్టేస్తారని అంటున్నారు.
ఈమధ్య కాలంలో పవర్ స్టార్ ని ఇలా చూపించలేదు అనిపించేలా ఇంకా చెప్పాలంటే వింటేజ్ పవర్ స్టార్ స్టైల్ ని యాటిట్యూడ్ ని యాజిటీజ్ దించేలా క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడట సుజిత్. మరి సుజిత్ చేస్తున్న ఈ హోం వర్క్ అంతా కూడా ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓజీ సినిమా ఎప్పుడొప్పుడు వస్తుందా చూద్దామా అనే ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. సుజిత్ కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా చూస్తున్నాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు మొదటి భాగం ఈ నెల చివరన రిలీజ్ ప్లాన్ చేయగా ఓజీ సినిమాను జూన్ లేదా జూలైలో రిలీజ్ ప్లాన్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.