కార్తీ లడ్డు కామెంట్స్ పై పవన్ సీరియస్
లడ్డు కల్తీ కచ్చితంగా హిందువుల మనోభావాల్ని కించపరచడమే అని మరికొందరు అంటున్నారు.
ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కల్తీ వ్యవహారం హిందూ ప్రజల విశ్వాసాలు, మనోభావాలతో ముడిపడి ఉండటంతో పెద్ద రాజకీయ వివాదంగా మారింది. దీనిపై ఎవరి అభిప్రాయాలని వారు చెబుతున్నారు. ఇదంతా రాజకీయ వివాదం అని కొంతమంది కొట్టిపడేస్తూ ఉన్నారు. లడ్డు కల్తీ కచ్చితంగా హిందువుల మనోభావాల్ని కించపరచడమే అని మరికొందరు అంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. తాజగా విజయవాడలో ఇంద్రకీలాద్రి ఆలయం శుద్ధి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ అనేది హిందువుల మనోభావాలకు సంబంధించిందని అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో సమాధానం చెప్పారు. నటుడు ప్రకాష్ రాజ్ పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే హీరో కార్తీ పైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాజాగా ‘సత్యం సుందరం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో లడ్డు కావాలా నాయనా అనే మీమ్ ని యాంకర్ అడిగారు. దీనిపై కార్తీ సరదాగా మాట్లాడుతూ లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ… దానిపై మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ అని మీరు జోకులు వేస్తున్నారు. మరోసారి అలా మాట్లాడకండి. మీరంటే యాక్టర్ గా నాకు గౌరవం ఉంది.
సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడేముందు వందసార్లు ఆలోచించుకోండి.. అని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే అభిమానులు కూడా ఎంతసేపు మూవీ టికెట్స్, హీరోల గురించి మాత్రమే కాకుండా హిందువులుగా సనాతన ధర్మం గురించి పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సెలబ్రెటీలలో పెద్దగా ఎవరూ కూడా లడ్డు కాంట్రవర్సీపై కామెంట్స్ చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికే లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. వాటికి మంచు విష్ణు కౌటర్ ఇచ్చారు. ఇక మంచు విష్ణు కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. అలాగే మంచు మోహన్ బాబు లడ్డు కల్తీపై తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఇక పవన్ కామెంట్స్ పై హీరో కార్తి రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.