అన్నయ్యకు పవర్ స్టార్ విషేష్ ఏ రేంజ్ లో అంటే?
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఒక్కసారిగా అభిమానుల విషెస్ తో సోషల్ మీడియా వేడెక్కింది.
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఒక్కసారిగా అభిమానుల విషెస్ తో సోషల్ మీడియా వేడెక్కింది. అర్దరాత్రి నుంచి అన్నయ్యకు పుట్టని రోజు శుభాకాక్షంలు తెలియజేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్ వేదికగా ఎవరి స్టైల్లో వారు విషెస్ చెబుతున్నారు. అలాగే అన్ని సినీ పరిశ్రమల నుంచి సెలబ్రిటీ లంతా కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అన్నయ్య పేరిట ప్రతీ ఏటా నిర్వహించే రక్తదానం కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా అన్నయ్యకు తమ్ముడు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విషెస్ తెలియజేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా బాద్యతలు నెరవేరుస్తోన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వచ్చిన అన్నయ్య తొలి బర్త్ డే కూడా ఇదే కావడం విశేషం.
`నా దృష్టిలో ఆపద్భాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రేమ పూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణధానం చేసిన సందర్భాలెన్నో. కొందరికి చేసిన సహాయం మీడియా ద్వారా బాహ్యా ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావాల్సిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్దిస్తారు.
ఆ గుణమే చిరంజీవి గారిని సుగుగణ సంపన్నునిగా చేసిందేమో. జనసేన పార్టీకి ఐదు కోట్లు విరాళంగా ఇచ్చి విజయం సాధించాలని మా ఇలవేల్పు అంజనేయ స్వామి సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అంఖడ విజయాన్ని అందించాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతలు చెబుతున్నా.తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుషు తో ఆరోగ్యంగా జీవించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నా` అని అన్నారు.