పవన్ రిక్వెస్ట్‌... అప్‌డేట్స్ అన్నీ క్యాన్సల్‌

కానీ అన్నింటిని క్యాన్సల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-02 06:19 GMT

టాలీవుడ్‌ స్టార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ గత కొన్ని వారాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన బర్త్‌ డే రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించుకోవాలని ప్లాన్‌ చేశారు. సోషల్ మీడియాలో కామన్ డీపీ, కామన్ వాట్సప్‌ స్టేటస్ వీడియోలు ఇలా ఎన్నో చక్కర్లు కొట్టాయి. అదనంగా ఆయన నటిస్తున్న ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా ఇవ్వాలని భావించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ అన్నింటిని క్యాన్సల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నేడు పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా విడుదల అవ్వాల్సిన ఓజీ అప్‌డేట్‌ ఇంకా హరి హర వీరమల్లు సినిమా పోస్టర్‌ ను క్యాన్సల్‌ చేయడం జరిగింది. అందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. పవన్‌ కళ్యాణ్‌ రిక్వెస్ట్‌ మేరకు నేడు విడుదల చేయాల్సిన అప్‌డేట్స్ అన్నింటిని కూడా క్యాన్సల్‌ చేస్తున్నట్లుగా ఓజీ మేకర్స్ నుంచి సోషల్‌ మీడియా ద్వారా అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో ఫ్యాన్స్‌ ఇంకా ప్రేక్షకులు అంతా కూడా ఉసూరుమంటున్నారు.

ఓజీ సంబరాలు భవిష్యత్తులో చాలా ఉంటాయి, తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా అందులో పాల్గొని వేడుక చేసుకుందాం. కానీ ప్రస్తుతానికి పవన్‌ కళ్యాణ్‌ గారి అభ్యర్థన మేరకు నేటి అప్డేట్‌ ను వాయిదా వేస్తున్నట్లుగా డివివి దానయ్య టీం ఎక్స్ లో ట్వీట్‌ చేయడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమా అధికారిక ఎక్స్‌ ఖాతాలో కూడా అటు ఇటుగా అదే మెసేజ్‌ తో అప్‌డేట్ క్యాన్సల్‌ అంటూ పోస్ట్‌ చేయడం జరిగింది. ప్రేక్షకులు ఓజీ లో పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ తో పాటు సినిమా కొత్త విడుదల తేదీ, షూటింగ్ పునఃప్రారంభం కు సంబంధించిన విషయాలు తెలుస్తాయని ఆశగా ఎదురు చూశారు. కానీ అన్ని క్యాన్సల్‌ అయ్యాయి.

పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలు కూడా ఇంతకు ముందు అనుకున్న స్థాయిలో జరిగే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు. దాంతో వేడుక కి వీలు లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్‌ రీ రిలీజ్ చేశారు. వర్షాలు, వరదలు లేని చోట గబ్బర్ సింగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా పెద్ద మొత్తంలో టికెట్లు అమ్ముడు పోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ లో గబ్బర్‌ సింగ్‌ షో లకు మంచి రెస్పాన్స్‌ దక్కింది. ఏపీ లో మాత్రం వరదల కారణంగా కలెక్షన్స్ తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News