అన్నయ్య అవార్డుపై తమ్ముడు ఏమంటున్నాడు!
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా అభిమానుల ఆనందానికి అవదుల్లేవ్. ఇప్పటికే పద్మభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి ఖాతాలో తాజాగా పద్మవిభూషణ్ కూడా చేరడంతో సోషల్ మీడియా వేది కగా అభిమానులంతా విషెస్ తో హోరెత్తిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ సంతోషానికైతే ఆకాశమే హద్దు.
రాత్రి నుంచి ఆ కుటుంబం సహా అభిమానులంతా ఎంతో గర్విస్తున్నారు. మరి తమ్ముడు..జనసేన అధి నేత పవన్ కళ్యాణ్ అన్నయ్యకొచ్చిన అవార్డుపై ఏమంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
`భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య చిరంజీ వికి ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. `నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను.. చిత్రాన్నీ మనసుపెట్టి చేశారని.. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా చిరంజీవి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా అన్నయ్యకి హృదయపూర్వక అభినందనలు` అని అన్నారు.
చిరంజీవి ఇప్పటికే రాష్ట్ర..జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన సేవల్ని గుర్తించి రెండు రకాల ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. తాజాగా దేశంలోనే అత్యున్నత రెండవ పురస్కారం కూడా తీసుకోవడంతో ఇక ఆయన ఖాతాలో చేరాల్సింది భారతరత్న ఒక్కటే. ఇప్పటి కే స్వర్గీయ నందమూరి తారకరామారావుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే.