క‌మిట్ మెంట్లు పూర్త‌యిన త‌ర్వాత రిటైర్మెంట్!

ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ క‌మిట్ అయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ముందుగా 'ఓజీ'..'హ‌రి హ‌ర వీర‌మల్లు' చిత్రాల షూటింగ్ ని పూర్తి చేసి వాటిని విడుద‌ల చేయాలి.

Update: 2024-06-08 16:30 GMT

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపు ఇప్పుడు అత్యంత బ‌రువైన బాధ్య‌త‌. ఐదు కోట్ల ఆంధ్రులకు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేర్చాల్సిన బాధ్య‌త పార్టీపై ఉంది. గెలిచింది 21 ఎమ్మెల్యేలు..2 ఎంపీలే అయినా కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జ‌ల కిచ్చిన ప్రతీ హామీని నెర‌వేర్చుతాన‌ని ప్రామిస్ చేసి అధికారంలోకి వ‌చ్చారు. ప్ర‌శ్నించ‌డం జ‌న‌సేన నైజ‌మ‌ని చెప్పిన ప‌వ‌న్ ఆ దిశ‌గానూ అడుగులు వేస్తార‌ని ప్ర‌జ‌లంతా ఎదురు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయం..సినిమా అనే రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణానికి పీకే ఎంత‌వ‌ర‌కూ న్యాయం చేస్తారు? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌స్తుతానికి ప‌వ‌న్ క‌మిట్ అయిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ముందుగా 'ఓజీ'..'హ‌రి హ‌ర వీర‌మల్లు' చిత్రాల షూటింగ్ ని పూర్తి చేసి వాటిని విడుద‌ల చేయాలి. అవి రెండేసు భాగాలుగా రిలీజ్ కానున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాళిక వేసుకుని వాటిని ప్రేక్ష‌కాభిమానుల ముందుకు తీసుకురావాలి. మొద‌టి రెండు భాగాలు ఇదే ఏడాది రిలీజ్ అవుతాయ‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి అది ఎంత‌వ‌ర‌కూ సాధ్య‌మ‌వుతుందో చూడాలి.

అలాగే హ‌రీష్ శంక‌ర్ తో 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' ని కూడా పూర్తి చేయాలి. ఇది వ‌చ్చే ఏడాది రిలీజ్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతానికి పీకే ముందు పూర్తి చేయాల్సిన సినిమాల లిస్ట్ అది. ఓవైపు ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రవుతూనే సినిమాల‌కు స‌మ‌యం కేటాయించాలి. అయితే ఈ సినిమాలు రిలీజ్ అయిన త‌ర్వాత ప‌వ‌న్ కొత్త సినిమాల‌కు డేట్లు ఇస్తారా? పూర్తి స్థాయిలో రాజ‌కీయంలోనే కొన‌సాగుతారా? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రం.

త‌న అవ‌స‌రాల కోసం సినిమాలు చేస్తాన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. కానీ ఇప్పుడ‌ది సాధ్య‌ప‌డుతుందా? అన్న‌ది చూడాలి. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీని బ‌లోపేతం చేయాలి. ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలోకి రావాలంటే? ఇప్ప‌టి నుంచే స‌న్న‌ధ‌మైతే త‌ప్ప ప‌న‌వ్వ‌దు. పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌నే ఒత్తిడికి కూడా ఏడాది త‌ర్వాత మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రి వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ సినిమాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా? లేక రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తారా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News