ట్విట‌ర్ లో టాలీవుడ్ స్టార్ ఒకే ఒక్క‌డు!

తాజాగా గ‌త నెల‌లో ట్విట‌ర్లో మోస్ట్ సెర్చ్ బుల్ ప‌ర్స‌న్ గా ప‌వ‌న్ నిలివ‌డం విశేషం. జులై నెల‌కు సంబంధించి రిలీజ్ చేసిన టాప్ 10 జాబితాలో ప‌వ‌న్ పేరుంది

Update: 2023-08-04 08:49 GMT

సోష‌ల్ మీడియాలో మ‌హేష్‌..బ‌న్నీ..చ‌ర‌ణ్‌..తార‌క్..ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వీళ్ల‌తో పోల్చుకుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాలోయింగ్ సోష‌ల్ మీడియాలో కాస్త త‌క్కువ‌గానే ఉంటుంది. హీరోలంతా ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియాకంటూ ఓటీమ్ ని ఏర్పాటు చేసుకుని నిర్వ‌హిస్తుంటారు గ్రాప్ మెరుగు ప‌రుచుకోవ‌డం కోసం ప్ర‌త్యేక‌మైన స్ట్రాట‌జీని అనుస‌రిస్తుంటారు. పవ‌న్ క‌ళ్యాణ్ మాత్రం అలాంటి వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఎలాంటి స్ట్రాట‌జీలు కూడా వాడ‌రు. న‌టుడిగా..రాజ‌కీయ‌నాయ‌కుడిగా ఆయ‌న‌కున్న క్రేజ్ ఉండ‌నే ఉంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా గ‌త నెల‌లో ట్విట‌ర్లో మోస్ట్ సెర్చ్ బుల్ ప‌ర్స‌న్ గా ప‌వ‌న్ నిలివ‌డం విశేషం. జులై నెల‌కు సంబంధించి రిలీజ్ చేసిన టాప్ 10 జాబితాలో ప‌వ‌న్ పేరుంది. టాలీవుడ్ నుంచి కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌డే ఉన్నారు.

మిగ‌తా ఏ హీరో కూడా ఆ రేసులో లేరు. ఈ జాబితా రిలీజ్ చేసిన నెంబ‌ర్ వ‌న్ స్థానంలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోది..రెండ‌వ స్థానంలో క్రికెట‌ర్ విరాట్ కొహ్లీ..మూడ‌వ స్థానంలో బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ ఉన్నారు.

ఆ త‌ర్వాత సునీల్ ఛత్రీ..మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఎల్వీష్ యాద‌వ్..ప‌వ‌న్ క‌ళ్యాన్‌..సీఎం యోగి..న‌టుడు సూర్య..విజ‌య్ నిలిచారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి గ‌త నెల‌లో ట్విట‌ర్ హీరోగా నిలిచార‌ని చెప్పొచ్చు. ఆయ‌న‌కు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమాను లున్నారు. ఆయ‌న్ని దేవుడిగా ఆరాదించేది ఎంతో మంది. ఇక జ‌న‌సేన పార్టీ పెట్టిన త‌ర్వాత పాపులారిటీ పెరిగింది.

న‌టుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగానూ ఆయ‌న గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఈ మ‌ధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో విమ‌ర్శ‌ల్లో భాగంగా ప‌వ‌న్ పేరు సంచ‌ల‌నంగా మార‌డంతో! ఆయ‌న పేరు అన్నిచోట్లా హాట్ టాపిక్ గా మారింది. ఆ ర‌కంగా నేష‌న‌ల్ మీడియాని ప‌వ‌న్ బాగా ఆక‌ర్షించారు.

ముఖ్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా బాగా దుమారం రేపాయి. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ని త‌ప్పుబ‌డుతూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లుగానీ..మ‌హిళ‌ల డేటా ప్ర‌భుత్వం నుంచి లీక‌వుతుంద ని..అది త‌ప్పుడు మార్గంలో వెళ్తోంది అన్న వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇలా కొన్ని అంశాలు ప‌వ‌న్ ని ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసాయి.

Tags:    

Similar News