పవన్ ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ పిక్ వైరల్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికర ఫోటోను షేర్ చేశారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఇస్టాగ్రామ్ లో పోస్ట్ లు చాలా తక్కువగా ఉంటాయి. చాలా రేర్ ఫోటోలను మాత్రమే ఆయన షేర్ చేస్తూ ఉంటారు. ఈసారి ఆయన తన సోదరి తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. చిన్నతనంలో బెంగాల్ టైగర్ బొమ్మల ముందు నేను నా సోదరి ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన మధురమైన జ్ఞాపకం అంటూ ఈ ఫోటోలను పవన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఇన్ స్టా లో చాలా తక్కువ ఫోటోలను షేర్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత పవన్ ఈ ఫోటోను షేర్ చేయడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ పండుగ రోజు ఈ ఫోటోను షేర్ చేసి ఉంటే ప్రత్యేకంగా ఉండేది. రక్షా బంధన్ రోజు కాకుండా సోదరితో కలిసి దిగిన ఈ ఫోటోను నేడు షేర్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటి డిప్యూటీ సీఎం గారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటోను తెగ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
రాజకీయాలతో బిజీగా ఇన్నాళ్లు గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం పరిపాలన పై పూర్తి శ్రద్ద పెట్టి బిజీ బిజీగా ఉన్నారు. సినిమాల కోసం డేట్లు కూడా ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిపాలనకు సమయం కేటాయిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ నుంచి ఈ ఫోటో రావడం చాలా ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ఇంకా పవన్ కి వీరాభిమానులుగా చెప్పుకునే వారు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అఫిషియల్ ఇన్ స్టా అకౌంట్ నుంచి ఈ ఫోటో రావడం చాలా సంతోషంగా ఉందని కొందరు అంటున్నారు.
పవన్ సినిమాల విషయానికి వస్తే... హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా పవన్ కమిట్ అయ్యాడు. ఓజీ మేకర్స్ అయిన దర్శకుడు సాహో సుజీత్ ఇంకా నిర్మాత దానయ్య లు స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది. దాంతో త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉందని నెటిజన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక హరి హర వీరమల్లు సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల అవ్వబోతుందని, ఇప్పటికే మొదటి పార్ట్ షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది. ఒక వైపు పరిపాలనతో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలు చేయాలని పవన్ భావిస్తున్నాడు. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.