మాయ చేసిన మురారిని గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుందా?
మూవీ రీరిలీజ్ రైట్స్ ని కొనేసి 4K వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావడం మొదలు పెట్టారు.
టాలీవుడ్ లో పోకిరి సినిమాతో రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల పాత హిట్ మూవీస్ ని 4K వెర్షన్ లో మరల థియేటర్స్ లో ఫ్యాన్స్ కోసం రీరిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ని తరువాత అందరి హీరోల అభిమానులు ఫాలో అయ్యారు. ఈ రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలకి మంచి ఆదరణ వస్తూ ఉండటంతో డైరెక్ట్ గా కొంతమంది డిస్టిబ్యూటర్స్ రంగంలోకి దిగిపోయారు.
మూవీ రీరిలీజ్ రైట్స్ ని కొనేసి 4K వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావడం మొదలు పెట్టారు. ఫ్యాన్స్ కూడా ఎగబడి చూడటంతో కొన్ని సినిమాలకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో ఖుషి, బిజినెస్ మెన్, ఆరెంజ్ లాంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. అలాగే ఈ నగరానికి ఏమైంది మూవీకి ఫస్ట్ రిలీజ్ కంటే రీరిలీజ్ ద్వారానే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సూర్య సూపర్ హిట్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా రీరిలీజ్ చేయగా మంచి వసూళ్లు అందుకుంది.
ఈ ట్రెండ్ తెలుగులో మెల్లగా తగ్గిన సమయంలో తమిళంలోకి వెళ్ళింది. అక్కడ విజయ్ ‘గిలి’ మూవీ రీరిలీజ్ ద్వారా ఏకంగా 32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన ఓల్డ్ క్లాసిక్ మూవీ మురారిని 4K వెర్షన్ లో రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకి అద్భుతమైన ఆదరణ లభించింది. 8-9 కోట్ల మధ్యలో మురారి కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఖుషి రీరిలీజ్ కలెక్షన్స్ రికార్డ్ ని మురారి బ్రేక్ చేసిందని టాక్. ఇప్పుడు మురారి రికార్డ్ ని మళ్ళీ అధికమించే ఛాన్స్ పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఆయన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ రీరిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక థియేటర్స్ లోకి వస్తోన్న మూవీ కావడంతో ఈ చిత్రంపై హైప్ నెలకొని ఉంది.
కచ్చితంగా రికార్డ్ కలెక్షన్స్ అందించాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అదే జరిగితే మురారి రికార్డ్ ని గబ్బర్ సింగ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఆగష్టు 27న నాని సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే గబ్బర్ సింగ్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చనే మాట వినిపిస్తోంది.