పదేళ్ల తర్వాత ఇవేం మాటలు పాయల్‌...?

సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌లో పాయల్‌ రాజ్‌పూత్‌... సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగడం అనేది అత్యంత కఠినమైనది.;

Update: 2025-04-01 13:22 GMT
పదేళ్ల తర్వాత ఇవేం మాటలు పాయల్‌...?

ఆర్ఎక్స్ 100, RDX లవ్, మంగళవారం వంటి విభిన్న చిత్రాల్లో నటిస్తూ దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌. హీరోయిన్‌గా ఈమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం స్కిన్‌ షో కు పరిమితం అయింది. ఈమధ్య కాలంలో హీరోయిన్స్‌ ఎక్కువగా స్కిన్‌ షో కే పరిమితం అవుతున్నారు. అయితే చాలా మంది హీరోయిన్స్ మాదిరిగా కాకుండా ఈమెకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు, సినిమాలు బాగానే పడ్డాయి. ముఖ్యంగా ఈమె ఆర్‌ఎక్స్ 100, మంగళవారం సినిమాల్లో నట విశ్వరూపం చూపించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు కలిగి ఉన్న పాయల్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌లో పాయల్‌ రాజ్‌పూత్‌... సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగడం అనేది అత్యంత కఠినమైనది. ప్రతి రోజు ఒక అనిశ్చితితో మొదలవుతుంది. నేను ప్రతి సారి ప్రతిభను కప్పిపుచ్చే ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంటాను. కొందరు కావాలని తొక్కేస్తా ఉంటే, కొందరు తమ వారి కోసం ప్రతిభను తొక్కేస్తూ ఉంటారు. ప్రముఖ ఇంటి పేరు కలిగి ఉన్న వారు సినిమా ఆఫర్లను దక్కించుకోవడం చూస్తూ ఉంటాను. ఎంతో కష్టపడి, అంకిత భావంతో పని చేస్తున్నప్పటికీ కొన్ని సార్లు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు, రావాల్సిన అవకాశాలు రావడం లేదు. నెపొటిజం ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం అనేది చాలా పెద్ద విషయంగా మారిందని ట్వీట్‌ చేసింది.

సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్స్‌, ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతున్న హీరోయిన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నెపొటిజం కారణంగా ఇండస్ట్రీలో ఆఫర్లు రావడం లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పాయల్‌కి ఇన్నాళ్లు చాలానే ఆఫర్లు వచ్చాయి. వచ్చిన అవకాశాలతో సద్వినియోగం చేసుకోకుండా ఇంకా ఆఫర్లు రావడం లేదని వాపోవడం ఏంటో అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2017లో చన్నా మెరెయ పంజాబీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయల్‌ రాజ్‌పూత్‌ టాలీవుడ్‌లో ఆర్‌ఎక్స్ 100 సినిమాను చేయడానికి ముందు హిందీలో ఒక సినిమాను చేసింది. ఆ సినిమాలతో దక్కని గుర్తింపు ఆర్‌ఎక్స్ 100 తో దక్కింది.

తెలుగులో పలు సినిమాల్లో నటించి హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్‌ భాషల్లో పలు సినిమాల్లో నటించిన పాయల్‌ రాజ్‌పూత్‌ ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో ఆఫర్లు రావడం లేదని ఎందుకు అంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌ 1న ఈమె ట్వీట్‌ చేసింది కనుక ఇది ఏమైనా తన ఫాలోవర్స్‌ను ఫూల్స్‌ను చేయడంలో భాగంగా ఏమైనా చేసిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఈమె అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుందని, ఆ ప్రయత్నాలు విఫలం అవుతున్న కారణంగా తాను ఇలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ ట్వీట్స్‌ను పాయల్‌ ఎందుకు చేసింది అనేది ఆమెనే మరింత క్లారిటీగా చెబితే బాగుంటుంది అని కొందరు అంటున్నారు.

Tags:    

Similar News