పాయల్.. ఇంతకంటే ఘాటైన లుక్ ఉంటుందా..?
ముఖ్యంగా ఆమె నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో పాయల్ రాజ్ పూత్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన గ్లామర్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అందులో పాయల్ రాజ్ పుత్ కనిపించిన విధానం కుర్రాళ్ళ మనసును గట్టిగానే దోచేసింది. ఇక తర్వాత సినిమాలలో కూడా ఆమె కాస్త గ్లామర్ డోస్ పెంచి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా మంగళవారం సినిమాతో కూడా స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఆ సినిమాలో కూడా బోల్డ్ సీన్స్ ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అలాగే నటిగా కూడా ఆమె మంచి మార్కులు అందుకుంది అని చెప్పాలి.
ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ కు పాయల్ రాజ్ పుత్ బెస్ట్ ఆప్షన్ అనే విధంగా ఆమె తన టాలెంట్ చూపించింది. ఇక సోషల్ మీడియాలో కూడా పాయల్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పాయల్ బటన్స్ లేని సూట్ లో గతంలో ఎప్పుడూ లేనంత ఘాటుగా దర్శనమిచ్చింది.
గతంలో బికినీలో కూడా కనిపించిన అమ్మడు ఈ లుక్ లో మాత్రం చాలా అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ తరహా గ్లామర్ డోస్ ఎంత పెంచిన కూడా ఆమెకు అగ్ర హీరోలతో అవకాశాలు మాత్రం రావడం లేదు. చిన్న తరహా సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అది కూడా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులలో ఎక్కువగా నటిస్తోంది.
ఇక మంచి కంటెంట్ ఉన్న బిగ్ సినిమాలలో ఆమె అవకాశం అందుకోవాలని అనుకుంటుంది. రీసెంట్ గా మరొక లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. నిర్మాతతో కాస్త విభేదాలు వచ్చినప్పటికీ చివరికి మళ్ళీ ఆమె చాలా కూల్ గానే రియాక్ట్ అయింది.
ఇక ప్రస్తుతం ఆమె మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి సుహాస్ తో నటించబోతున్నట్లుగా గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. అలాగే మరో లేడీ ప్రాజెక్టు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి తన గ్లామర్ తో అమ్మడు ఇండస్ట్రీలో ఇంకా ఎలాంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.